Аль-МухтасарАн‑Нахль · 16:1–40

Аль-Мухтасар · Тафсир · на телугу

النحل

Ан-Нахль

Пчелы · Мекканская · 128 аятов

16:1Страница 267

أَتَىٰٓ أَمۡرُ ٱللَّهِ فَلَا تَسۡتَعۡجِلُوهُۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ١

Веление Аллаха придет, и не пытайтесь это ускорить. Преславен Он и превыше того, что они приобщают в сотоварищи!

ఓ అవిశ్వాసపరులారా అల్లాహ్ నిర్ణయించిన మీ శిక్ష దగ్గరయింది. అయితే దాని సమయం కన్న ముందే దాన్ని తొందర చేయమని మీరు అడగకండి. మహోన్నతుడైన అల్లాహ్ ముష్రికులు సాటి కల్పిస్తున్న వాటి నుండి పరిశుద్ధుడు.

16:2Страница 267

يُنَزِّلُ ٱلۡمَلَٰٓئِكَةَ بِٱلرُّوحِ مِنۡ أَمۡرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦٓ أَنۡ أَنذِرُوٓاْ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱتَّقُونِ ٢

Он ниспосылает ангелов с духом (откровением) по Своему велению тому из Своих рабов, кому пожелает: «Предостерегайте тем, что нет божества, кроме Меня. Бойтесь же Меня».

ఓ ప్రవక్తల్లారా ప్రజలను అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం నుండి మీరు భయపెట్టటానికి అల్లాహ్ వహీ ద్వారా తన నిర్ణయాన్ని తన ప్రవక్తల్లోంచి తాను ఎవరిని కోరుకుంటే వారిపై దైవదూతలను అవతరింపజేస్తాడు. అయితే నేను తప్ప ఇంకెవరూ సత్య ఆరాధ్య దైవం లేడు. కావున ఓ ప్రజలారా మీరు నా ఆదేశములను పాటిస్తూ,నేను వారించిన వాటికి దూరంగా ఉంటూ నా పట్ల భయభీతి కలిగి ఉండండి.

16:3Страница 267

خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۚ تَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ٣

Он сотворил небеса и землю ради истины. Он превыше тех, кого они приобщают в сотоварищи!

అల్లాహ్ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సత్యముతో సృష్టించాడు. ఆ రెండింటిని నిష్ఫలితంగా సృష్టించలేదు. ఆ రెండింటితో తన గొప్పతనాన్ని తెలియపరచటానికి వాటిని సృష్టించాడు.అతని తోపాటు ఇతరులను వారు సాటి కల్పిస్తున్న దాని నుండి అతడు పరిశుద్ధుడు.

16:4Страница 267

خَلَقَ ٱلۡإِنسَٰنَ مِن نُّطۡفَةٖ فَإِذَا هُوَ خَصِيمٞ مُّبِينٞ ٤

Он сотворил человека из капли, и после этого тот открыто пререкается.

ఆయన మనిషిని నీచమైన వీర్య బిందువు నుండి సృష్టించాడు. అప్పుడు అతను ఒక రూపము నుండి ఇంకో రూపములో పెరుగుతూ పోయాడు.(నుత్ఫా-అల్ఖా-ముజ్గా).అప్పుడు అతను అసత్యము ద్వారా సత్యాన్ని అంతం చేయటానికి తీవ్రంగా తగువులాడేవాడు అయిపోయాడు. అతను దాని ద్వారా బహిరంగంగా తగువులాడుతున్నాడు.

16:5Страница 267

وَٱلۡأَنۡعَٰمَ خَلَقَهَاۖ لَكُمۡ فِيهَا دِفۡءٞ وَمَنَٰفِعُ وَمِنۡهَا تَأۡكُلُونَ ٥

Он также сотворил скот, который приносит вам тепло и пользу. Вы также употребляете его в пищу.

ఓ ప్రజలారా ఆయన పశువుల్లోంచి ఒంటెలను,ఆవులను,గొర్రెలను మీ ప్రయోజనముల కొరకు సృష్టించాడు. ఈ ప్రయోజనాల్లోంచి వాటి ఉన్ని,వాటి జుట్టు ద్వారా వెచ్చదనాన్ని పొందటం,వాటి పాలల్లో,వాటి చర్మాల్లో,వాటి వీపుల్లో వేరే ప్రయోజనాలు ఉన్నవి. మరియు మీరు వాటి నుండే తింటున్నారు.

16:6Страница 267

وَلَكُمۡ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسۡرَحُونَ ٦

Они украшают вас, когда вы пригоняете их обратно вечерами и выводите на пастбище по утрам.

మరియు మీరు వాటిని ప్రొద్దున సాయంత్రం మేపటానికి తీసుకుని వెళ్ళేటప్పుడు మీ కొరకు వాటిలో ఒక అందం ఉన్నది.

16:7Страница 268

وَتَحۡمِلُ أَثۡقَالَكُمۡ إِلَىٰ بَلَدٖ لَّمۡ تَكُونُواْ بَٰلِغِيهِ إِلَّا بِشِقِّ ٱلۡأَنفُسِۚ إِنَّ رَبَّكُمۡ لَرَءُوفٞ رَّحِيمٞ ٧

Они перевозят ваши грузы в края, достичь которых вы могли бы только ценой больших усилий. Воистину, Господь ваш - Сострадательный, Милосердный.

మేము మీ కొరకు సృష్టించిన ఈ పశువులు మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు మీ ప్రయాణముల్లో మీ బరువైన సామగ్రిని మోస్తాయి. ఓ ప్రజలారా నిశ్చయంగా మీ ప్రభువు ఈ పశువులను మీ ఆదీనంలో చేసి ఎంతో కరుణించాడు,కనికరించాడు.

16:8Страница 268

وَٱلۡخَيۡلَ وَٱلۡبِغَالَ وَٱلۡحَمِيرَ لِتَرۡكَبُوهَا وَزِينَةٗۚ وَيَخۡلُقُ مَا لَا تَعۡلَمُونَ ٨

Он сотворил коней, мулов и ослов, чтобы вы ездили на них верхом и для украшения. Он творит также то, о чем вы не ведаете.

అల్లాహ్ గుర్రాలను,కంచర గాడిదలను,గాడిదలను మీరు వాటిపై స్వారీ చేయటానికి,మీ సామానును వాటిపై మీరు మోయించటానికి,మీరు ప్రజల మధ్య శోభను పెంచుకోవటానికి మీ కొరకు అవి శోభ అవటానికి మీ కొరకు సృష్టించాడు. మరియు అతడు తాను సృష్టించదలచుకున్న మీకు తెలియని వాటిని సృష్టిస్తాడు.

16:9Страница 268

وَعَلَى ٱللَّهِ قَصۡدُ ٱلسَّبِيلِ وَمِنۡهَا جَآئِرٞۚ وَلَوۡ شَآءَ لَهَدَىٰكُمۡ أَجۡمَعِينَ ٩

Аллах указывает на прямой путь, но есть дороги, которые уводят в сторону. Если бы Аллах пожелал, то Он вас всех наставил бы на прямой путь.

అల్లాహ్ పై తన మన్నతలకు చేర్చే తిన్నని మార్గమైన ఇస్లాంను స్పష్టపరిచే బాధ్యత ఉన్నది. మర్గముల్లోంచి షైతాను మార్గములు సత్యము నుండి వంకరగా ఉన్నవి. ఇస్లాం మార్గము కాకుండా ఉన్న ప్రతి మార్గము వంకరిది. ఒక వేళ అల్లాహ్ మిమ్మల్నందరిని విశ్వాసమును ప్రసాధించదలచితే మిమ్మల్నందరిని దాని కొరకు అనుగ్రహించేవాడు.

16:10Страница 268

هُوَ ٱلَّذِيٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗۖ لَّكُم مِّنۡهُ شَرَابٞ وَمِنۡهُ شَجَرٞ فِيهِ تُسِيمُونَ ١٠

Он - Тот, Кто ниспосылает с неба воду. Она служит для вас питьем, и благодаря ей произрастают растения, среди которых вы пасете скот.

పరిశుద్ధుడైన ఆయనే మేఘముల నుండి మీ కొరకు నీళ్ళను కురిపించాడు. ఆ నీటి నుండి మీరు త్రాగటానికి,మీ పశువులు త్రాగటానికి నీళ్ళు దొరుకును. దాని నుండి మీ పశువులు మేయటానికి మొక్కలు మొలకెత్తును.

16:11Страница 268

يُنۢبِتُ لَكُم بِهِ ٱلزَّرۡعَ وَٱلزَّيۡتُونَ وَٱلنَّخِيلَ وَٱلۡأَعۡنَٰبَ وَمِن كُلِّ ٱلثَّمَرَٰتِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ١١

Он взращивает для вас злаки, маслины, финики, виноград и всевозможные плоды. Воистину, в этом - знамение для людей размышляющих.

ఈ నీటి ద్వారా అల్లాహ్ మీ కొరకు మీరు తినే పంటలను పండిస్తున్నాడు,మీ కొరకు జైతూన్,ఖర్జూరపు వృక్షాలను,ద్రాక్షాలను పండిస్తున్నాడు. మరియు మీ కొరకు ఫలాలన్నింటిని పండిస్తున్నాడు. నిశ్చయంగా ఈ నీటిలో,దాని నుండి పుట్టుకొచ్చే వాటిలో అల్లాహ్ సృష్టిలో యోచన చేసే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై ఆధారము ఉన్నది. వారు దాని ద్వారా పరిశుద్ధుడైన ఆయన గొప్పతనముపై ఆధారము చూపుతారు.

16:12Страница 268

وَسَخَّرَ لَكُمُ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ وَٱلنُّجُومُ مُسَخَّرَٰتُۢ بِأَمۡرِهِۦٓۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ ١٢

Он покорил вам ночь и день, солнце и луну. Звезды также покорны по Его воле. Воистину, в этом - знамения для людей разумеющих.

మరియు అల్లాహ్ రాత్రిని మీరు అందులో విరామం తీసుకోవటానికి,విశ్రాంతి తీసుకోవటానికి,పగలును మీ జీవన సామగ్రిని అందులో సమకూర్చుకోవటానికి మీ కొరకు నియంత్రణలో పెట్టాడు. మరియు ఆయన సూర్యుడిని మీ కొరకు నియంత్రించి దానిని కాంతివంతంగా చేశాడు,చంద్రుడిని నియంత్రించి వెలుగుగా చేశాడు. మరియు నక్షత్రాలు ఆయన విధి ఆదేశము ద్వారా మీ కొరకు నియంత్రించబడ్డాయి. వాటి ద్వారానే మీరు భూమియొక్క,సముద్రము యొక్క చీకట్లలో మార్గమును పొందుతున్నారు,సమయములను,ఇతర వాటిని మీరు తెలుసుకో గలుగుతున్నారు. నిశ్చయంగా వీటన్నింటిని నియంత్రించటంలో తమ బుద్దిని వినియోగించే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై స్పష్టమైన సూచనలు కలవు. వారే వాటి నుండి విజ్ఞతను పొందుతారు.

16:13Страница 268

وَمَا ذَرَأَ لَكُمۡ فِي ٱلۡأَرۡضِ مُخۡتَلِفًا أَلۡوَٰنُهُۥٓۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَذَّكَّرُونَ ١٣

Он сотворил для вас на земле разнообразие цветов. Воистину, в этом - знамение для людей поминающих.

పరిశుద్ధుడైన ఆయన భూమిలో సృష్టించిన రకరకాల రంగులు కల నిక్షేపాలను,జంతువులను,మొక్కలను,పంటలను మీకు వశపరచాడు. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన సృష్టించటంలో,వశపరచటంలో పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యం పై దాని ద్వారా గుణపాటం నేర్చుకునే జాతి వారికి గొప్ప సూచన కలదు. మరియు వారు అల్లాహ్ సామర్ధ్యం కలవాడని,అనుగ్రహించేవాడని అర్ధం చేసుకుంటారు.

16:14Страница 268

وَهُوَ ٱلَّذِي سَخَّرَ ٱلۡبَحۡرَ لِتَأۡكُلُواْ مِنۡهُ لَحۡمٗا طَرِيّٗا وَتَسۡتَخۡرِجُواْ مِنۡهُ حِلۡيَةٗ تَلۡبَسُونَهَاۖ وَتَرَى ٱلۡفُلۡكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبۡتَغُواْ مِن فَضۡلِهِۦ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ ١٤

Он - Тот, Кто подчинил море, чтобы вы вкушали из него свежее мясо и добывали в нем украшения, которые вы носите. Ты видишь корабли, которые бороздят его для того, чтобы вы могли снискать Его милость, - быть может, вы будете благодарны.

పరిశుద్ధుడైన ఆయనే సముద్రమును మీకు వశపరచాడు. అప్పుడే దానిపై ప్రయాణము,అందులో ఉన్న వాటిని వెలికి తీయటం మీకు సంభవమైనది; మీరు వేటాడే చేపల మెత్తని,తాజా మాంసం మీరు తినటానికి,దాని నుండి మీరు అలంకరణకు మీరు తొడిగే,మీ స్త్రీలు తొడిగే ముత్యాల్లాంటి వాటిని మీరు వెలికి తీయటానికి. మరియు నీవు సముద్రపు అలలను చీల్చుకుంటూ వెళ్ళే ఓడలను చూస్తావు. మీరు ఈ ఓడలపై అల్లాహ్ అనుగ్రహముతో లభించే వ్యాపార లాభాలను ఆశిస్తూ,అల్లాహ్ మీకు ప్రసాధించిన అనుగ్రహాలకు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటమును ఆశిస్తూ ,ఆరాధనను ఆయన ఒక్కడికే ప్రత్యేకిస్తూ ప్రయాణం చేస్తారు.

16:15Страница 269

وَأَلۡقَىٰ فِي ٱلۡأَرۡضِ رَوَٰسِيَ أَن تَمِيدَ بِكُمۡ وَأَنۡهَٰرٗا وَسُبُلٗا لَّعَلَّكُمۡ تَهۡتَدُونَ ١٥

Он поместил на земле незыблемые горы, дабы она не колебалась вместе с вами, а также реки и дороги, дабы вы могли идти верным путем.

మరియు ఆయన భూమిలో అది మిమ్మల్ని తీసుకుని చలించకుండా,ప్రకంపించకుండా ఉండటానికి దాన్ని స్థిరంగా ఉంచే పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను మీరు వాటి నుండి నీళ్ళు త్రాగటానికి,మీ జంతువులకు,మీ పంటలకు నీరు పట్టటానికి ప్రవహింపజేశాడు. మరియు అందులో మార్గాలను మీరు వాటిలో నడవటానికి తీశాడు. అయితే మీరు దారి తప్పకుండా మీ గమ్య స్థానాలకు చేరుకుంటారు.

16:16Страница 269

وَعَلَٰمَٰتٖۚ وَبِٱلنَّجۡمِ هُمۡ يَهۡتَدُونَ ١٦

Он создал знаки. А по звездам они находят правильную дорогу.

మరియు ఆయన మీ కొరకు భూమిలో ప్రత్యక్ష సంకేతాలు వాటి ద్వారా మీరు నడవటంలో మార్గం పొందే వాటిని చేశాడు.మరియు ఆయన నక్షత్రాలను ఆకాశములో మీరు రాత్రి సమయాల్లో మార్గం పొందుతారని ఆశిస్తూ సృష్టించాడు.

16:17Страница 269

أَفَمَن يَخۡلُقُ كَمَن لَّا يَخۡلُقُۚ أَفَلَا تَذَكَّرُونَ ١٧

Разве Тот, Кто творит, подобен тому, кто не творит? Неужели вы не помяните назидание?

అయితే ఈ వస్తువులను,ఇతర వాటిని సృష్టించేవాడు ఏమీ సృష్టించని వాడికి సమానుడు కాగలడా ?.ఏమీ మీరు అన్ని సృష్టించే అల్లాహ్ గొప్పతనమును గమనించరా ?.మీరు ఆరాధనను ఆయన ఒక్కడికే ప్రత్యేకించండి,ఆయనతోపాటు ఏమీ సృష్టించని వారికి సాటి కల్పించకండి.

16:18Страница 269

وَإِن تَعُدُّواْ نِعۡمَةَ ٱللَّهِ لَا تُحۡصُوهَآۗ إِنَّ ٱللَّهَ لَغَفُورٞ رَّحِيمٞ ١٨

Если вы станете считать милости Аллаха, то не пересчитаете их! Воистину, Аллах - Прощающий, Милосердный.

ఓ ప్రజలారా అల్లాహ్ మీపై అనుగ్రహించిన అనేక అనుగ్రహాలను లెక్క వేయటానికి,వాటిని షుమారు చేయటానికి ప్రయత్నించినా అవి అనేకం అవటం వలన,అవి రకరకాలు కావటం వలన వాటిని మీరు లెక్కవేయలేరు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని వాటి గురించి కృతజ్ఞత తెలపటం నుండి నిర్లక్ష్యం వహించటం వలన పట్టుకోలేదు, ఆయన కరుణించేవాడు ఎందుకంటే ఆయనకి కృతజ్ఞత తెలపటంలో లోపము చేయటం వలన,పాపకార్యాల వలన మీ నుండి వాటిని అంతం చేయ లేదు.

16:19Страница 269

وَٱللَّهُ يَعۡلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعۡلِنُونَ ١٩

Аллах ведает то, что вы утаиваете, и то, что вы совершаете открыто.

మరియు ఓ దాసులారా మీరు గోప్యంగా ఉంచే మీ కర్మలన్ని అల్లాహ్ కు తెలుసు,వాటిలో నుండి మీరు బహిర్గతం చేసేవి ఆయనకు తెలుసు. వాటిలో నుండి ఏవి ఆయనపై గోప్యంగా లేవు. వాటి పరంగా ఆయన తొందరలోనే మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

16:20Страница 269

وَٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَا يَخۡلُقُونَ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ ٢٠

А те, к кому они обращаются с молитвами вместо Аллаха, не могут ничего сотворить, тогда как сами они были сотворены.

మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఏమీ సృష్టించ లేదు. ఒక వేళ అది చిన్నదైనా సరే (సృష్టించ లేదు).అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని వీరే తయారు చేసుకున్నారు. అయితే వారు తమ చేతులతో తయారు చేసుకున్న విగ్రహాలను అల్లాహ్ ను వదిలి ఎలా ఆరాధిస్తారు ?!.

16:21Страница 269

أَمۡوَٰتٌ غَيۡرُ أَحۡيَآءٖۖ وَمَا يَشۡعُرُونَ أَيَّانَ يُبۡعَثُونَ ٢١

Они мертвы, а не живы, и не знают они, когда будут воскрешены.

దానికి తోడుగా వాటి ఆరాధకులు తమ చేతులతో వాటిని తయారు చేసుకున్నారు. అవి ఎటువంటి ప్రాణము లేని,ఎటువంటి జ్ఞానము లేని నిర్జీవులు. వారు తమ ఆరాధకులతోపాటు ప్రళయదినాన నరకములో వారితోపాటు విసిరి వేయటానికి ఎప్పుడు లేపబడుతారో వారికి తెలియదు.

16:22Страница 269

إِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۚ فَٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٞ وَهُم مُّسۡتَكۡبِرُونَ ٢٢

Ваш Бог - Бог Единственный. Но сердца тех, которые не верует в Последнюю жизнь, отрицают истину, а сами они - высокомерные гордецы.

మీ సత్య ఆరాధ్య దైవం ఎటువంటి సాటి లేని ఆరాధ్య దైవం,అతడు అల్లాహ్. ఎవరైతే ప్రతిఫలం ప్రసాధించటానికి ఉన్న మరణాంతర జీవితమును విశ్వసించరో వారి హృదయాలు అల్లాహ్ ఏకత్వమును వాటికి భయం లేకపోవటం వలన నిరాకరించినవి. అవి ఎటువంటి లెక్క తీసుకోవటం గురించి,శిక్ష గురించి విశ్వసించటం లేదు.మరియు వారు సత్యాన్ని స్వీకరించకుండా,దానికి లొంగకుండా దురహంకారములో పడి ఉన్నారు.

16:23Страница 269

لَا جَرَمَ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡتَكۡبِرِينَ ٢٣

Несомненно, Аллах знает то, что вы утаиваете, и то, что вы обнародуете. Воистину, Он не любит высокомерных.

వాస్తవానికి నిస్సందేహంగా వీరందరు గోప్యంగా చేసేవి అల్లాహ్ కి తెలుసు.వాటిలో నుండి వారు బహిర్గతం చేసేవి ఆయనకు తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. వాటి పరంగా ఆయన వారికి తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు. పరిశుద్ధుడైన ఆయన తన ఆరాధన నుండి,తనకు అణకువ చూపటం నుండి అహంకారమును చూపేవారిని ఇష్టపడడు. కాని ఆయన వారిని ఎక్కువగా ద్వేషిస్తాడు.

16:24Страница 269

وَإِذَا قِيلَ لَهُم مَّاذَآ أَنزَلَ رَبُّكُمۡ قَالُوٓاْ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ٢٤

Когда им говорят: «Что ниспослал вам Господь?». - они говорят: «Это - легенды древних народов!».

మరియు సృష్టికర్త ఏకత్వమును నిరాకరించే,మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరిని అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏమి అవతరింపజేశాడు ? అని అడిగినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు : అతనిపై ఆయన ఏదీ అవతరింపజేయలేదు. అతడు తన తరపు నుండి పూర్వీకుల గాధలను,వారి అసత్యాలను మాత్రం తీసుకుని వచ్చాడు.

16:25Страница 269

لِيَحۡمِلُوٓاْ أَوۡزَارَهُمۡ كَامِلَةٗ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَمِنۡ أَوۡزَارِ ٱلَّذِينَ يُضِلُّونَهُم بِغَيۡرِ عِلۡمٍۗ أَلَا سَآءَ مَا يَزِرُونَ ٢٥

Пусть они понесут свою ношу целиком в Последний день, а также ношу тех невежд, которых они ввели в заблуждение. Как же отвратительна их ноша!

ఎటువంటి తగ్గుదల లేకుండా తమ పాపముల బరువు మోయటం మరియు ఎవరినైతే వీరు అజ్ఞానం వలన,అనుకరణ వలన ఇస్లాం నుండి అపమార్గమునకు లోను చేశారో వారి పాపముల బరువును మోయటం వారి పరిణామం కావటానికి. వారు మోసే తమ పాపముల బరువు,తమను అనుసరించే వారి బరువు ఎంతో చెడ్డదైనది.

16:26Страница 269

قَدۡ مَكَرَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَأَتَى ٱللَّهُ بُنۡيَٰنَهُم مِّنَ ٱلۡقَوَاعِدِ فَخَرَّ عَلَيۡهِمُ ٱلسَّقۡفُ مِن فَوۡقِهِمۡ وَأَتَىٰهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ ٢٦

Козни строили еще те, которые жили до них, но Аллах разрушил основание их строения. Крыша обрушилась на них сверху, и мучения постигли их оттуда, откуда они их не ожидали.

నిశ్చయంగా వీరందరికన్న ముందు అవిశ్వాసపరులు తమ ప్రవక్తల కొరకు కుట్రలు పన్నారు. అప్పుడు అల్లాహ్ వారి కట్టడములను వాటి పునాదులతోసహా శిధిలం చేశాడు. అప్పుడు వాటి పైకప్పులు వారిపై పడ్డాయి. వారు ఊహించని చోటు నుండి శిక్ష వారిపై వచ్చి పడింది. వాస్తవానికి వారి కట్టడాలు వారిని రక్షిస్తాయని వారు భావించేవారు. కాని వారు వాటి ద్వారానే తుదిముట్టించబడ్డారు.

16:27Страница 270

ثُمَّ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ يُخۡزِيهِمۡ وَيَقُولُ أَيۡنَ شُرَكَآءِيَ ٱلَّذِينَ كُنتُمۡ تُشَٰٓقُّونَ فِيهِمۡۚ قَالَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ إِنَّ ٱلۡخِزۡيَ ٱلۡيَوۡمَ وَٱلسُّوٓءَ عَلَى ٱلۡكَٰفِرِينَ ٢٧

А потом, в День воскресения, Он опозорит их и скажет: «Где же Мои сотоварищи, о которых вы спорили?». Те, которым было даровано знание, скажут: «Воистину, сегодня неверующих постигнут позор и зло».

ఆ తరువాత ప్రళయదినమున అల్లాహ్ వారిని శిక్ష ద్వారా అవమానపరుస్తాడు. దాని ద్వారా వారిని నీచపరుస్తాడు. మరియు వారితో మీరు నాతోపాటు ఆరాధనలో సాటికల్పించే భాగస్వాములు ఎక్కడ ఉన్నారు. వారి మూలంగా మీరు నా ప్రవక్తలతో,విశ్వాసపరులతో శతృత్వం చేసేవారు ? అని పలుకుతాడు. దైవ పండితులు ఇలా అంటారు : నిశ్చయంగా అవమానము,శిక్ష ప్రళయదినాన అవిశ్వాసపరులపై వచ్చిపడుతుంది.

16:28Страница 270

ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ ظَالِمِيٓ أَنفُسِهِمۡۖ فَأَلۡقَوُاْ ٱلسَّلَمَ مَا كُنَّا نَعۡمَلُ مِن سُوٓءِۭۚ بَلَىٰٓۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ٢٨

Те, кого ангелы умертвили, когда они грешили во вред себе, изъявят покорность и скажут: «Мы не совершили никакого зла». Им ответят: «О нет! Воистину, Аллаху известно о том, что вы совершали.

ఎవరినైతే దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు వారి ఆత్మలను తీస్తారో,వారు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి తమపై హింసకు పాల్పడ్డారు. వారిపై మరణం తాండవించినప్పుడు లొంగిపోయి విధేయత చూపుతారు. మరియు వారు పాల్పడిన అవిశ్వాసమును,పాపకార్యాలను నిరాకరిస్తారు వారి నిరాకరణ వారికి ప్రయోజనం చేకూరుస్తుందని భావించి. వారితో ఇలా పలకబడుతుంది : మీరు అబద్దం పలుకుతున్నారు. మీరు అవిశ్వాసపరులై ఉండేవారు మీరు పాల్పడిన పాపకార్యాలు మీకు తెలుసు. నిశ్చయంగా మీరు ఇహలోకంలో పాల్పడే వాటి గురించి అల్లాహ్ కి తెలుసు. వాటిలో నుంచి ఏవీ ఆయనపై గోప్యంగా లేవు. వాటి పరంగా వారికి ఆయన తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

16:29Страница 270

فَٱدۡخُلُوٓاْ أَبۡوَٰبَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۖ فَلَبِئۡسَ مَثۡوَى ٱلۡمُتَكَبِّرِينَ ٢٩

Войдите во врата Геенны и пребудьте там вечно. Как же скверна обитель возгордившихся!».

మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీరు మీ ఆచరణల ప్రకారం నరకంలో శాస్వతంగా నివాసముండటానికి ప్రవేశించండి. అల్లాహ్ పై విశ్వాసము నుండి,ఆయన ఒక్కడి ఆరాధన నుండి అహంకారమును చూపే వారికి అది నివాసంగా ఎంతో చెడ్డది.

16:30Страница 270

۞ وَقِيلَ لِلَّذِينَ ٱتَّقَوۡاْ مَاذَآ أَنزَلَ رَبُّكُمۡۚ قَالُواْ خَيۡرٗاۗ لِّلَّذِينَ أَحۡسَنُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٞۚ وَلَدَارُ ٱلۡأٓخِرَةِ خَيۡرٞۚ وَلَنِعۡمَ دَارُ ٱلۡمُتَّقِينَ ٣٠

Когда богобоязненных спрашивают: «Что ниспослал вам Господь?». - они говорят: «Благо». Тем, кто творил в этом мире добро, будет воздано добром. А Последняя обитель будет еще лучше. Как же прекрасна Обитель богобоязненных!

మరియు తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతి కలిగిన వారితో ఇలా పలకబడుతుంది : మీ ప్రభువు మీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏమి అవతరింపజేశాడు ?. వారు ఇలా సమాధానమిస్తారు : అల్లాహ్ ఆయనపై ఎంతో గొప్పదైన మంచిని అవతరింపజేశాడు. ఎవరైతే అల్లాహ్ ఆరాధనను ఉత్తమంగా చేస్తారో,ఆయన సృష్టితాల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో వారి కొరకు ఇహలోకంలో మంచి ప్రతిఫలం ఉన్నది. అందులో నుంచి సహాయము. ఆహారోపాదిలో విశాలత్వము.అల్లాహ్ వారి కొరకు పరలోకములో తయారుచేసి ఉంచిన ప్రతిఫలము ఇహలోకములో వారికి శీఝ్రంగా ప్రసాదించే దాని కన్న మేలైనది.తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ దైవభీతి కలిగిన వారి పరలోక గృహము ఎంతో గొప్పది.

16:31Страница 270

جَنَّٰتُ عَدۡنٖ يَدۡخُلُونَهَا تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ لَهُمۡ فِيهَا مَا يَشَآءُونَۚ كَذَٰلِكَ يَجۡزِي ٱللَّهُ ٱلۡمُتَّقِينَ ٣١

Они войдут в сады Эдема, в которых текут реки. Они получат там все, чего пожелают. Так Аллах воздает богобоязненным,

శాస్వతమైన,స్థిరమైన స్వర్గవనాల్లో వారు ప్రవేశిస్తారు. వాటి భవనములు,వాటి వృక్షాల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారి కొరకు ఈ స్వర్గవనాల్లో వారి మనస్సులు ఇష్టపడే తినే,త్రాగే ఆహారపదార్ధాలు,ఇంకా వేరేవి ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతి వారిలో నుండి దైవభీతి కలవారికి ఆయన ప్రసాధించే ఈ ప్రతిఫలం లాంటిదే పూర్వ జాతుల వారిలో నుండి దైవభీతి కలవారికి ఆయన ప్రతిఫలమును ప్రసాధిస్తాడు.

16:32Страница 270

ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ طَيِّبِينَ يَقُولُونَ سَلَٰمٌ عَلَيۡكُمُ ٱدۡخُلُواْ ٱلۡجَنَّةَ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ٣٢

которых ангелы умерщвляют праведниками. Они говорят: «Мир вам! Войдите в Рай благодаря тому, что вы совершали».

దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు ఎవరి ఆత్మలనైతే వారి హృదయములు అవిశ్వాసము నుండి పరిశుద్ధముగా ఉన్నస్థతిలో తీస్తారో , దైవ దూతలు వారిని ఉద్దేశించి తమ మాటల్లో ఇలా పలుకుతారు : మీపై శాంతి కలుగుగాక. మీరు ప్రతీ ఆపద నుండి సురక్షితంగా ఉన్నారు. మీరు ఇహలోకములో ఆచరించే సరైన విశ్వాసము,సత్కర్మకు బదులుగా స్వర్గంలో ప్రవేశించండి.

16:33Страница 270

هَلۡ يَنظُرُونَ إِلَّآ أَن تَأۡتِيَهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ يَأۡتِيَ أَمۡرُ رَبِّكَۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ٣٣

Неужели они ждут чего-либо иного, кроме ангелов или веления твоего Господа? Так же поступали те, которые жили прежде. Аллах не был несправедлив к ним - они сами поступали несправедливо по отношению к себе.

ఏమీ ? ఈ తిరస్కారులైన ముష్రికులందరు దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు వారి ప్రాణములను సేకరించటానికి,వారి ముఖములపై,వారి వీపులపై కొట్టడానికి వారి వద్దకు వచ్చేంత వరకు లేదా ఇహలోకములోనే శిక్ష ద్వారా వారిని నిర్మూలించటానికి అల్లాహ్ ఆదేశం వచ్చేంత వరకు నిరీక్షిస్తున్నారా ?. మక్కాలోని ముష్రికులు పాల్పడిన ఈ కార్యం లాంటి కార్యమును వారికన్న మనుపు ముష్రికులు పాల్పడ్డారు అప్పుడు అల్లాహ్ వారిని తుదిముట్టించాడు. ఆయన వారిని వినాశనమునకు గరి చేసినప్పుడు వారిపై హింసకు పాల్పడలేదు. కానీ వారే అల్లాహ్ పట్ల అవిశ్వాసం ద్వారా కావాలనే వినాశనమునకు కొనితెచ్చుకుని తమపై హింసకు పాల్పడ్డారు.

16:34Страница 270

فَأَصَابَهُمۡ سَيِّـَٔاتُ مَا عَمِلُواْ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ٣٤

Злое возмездие постигло их за то, что они творили, и окружило (или поразило) их то, над чем они издевались.

అప్పుడు వారు చేసుకున్న కర్మల శిక్షలు వారిపై వచ్చి పడ్డాయి. ఏ శిక్ష గురించి వారి ముందు ప్రస్తావించబడినప్పుడు వారు పరిహాసమాడేవారో ఆ శిక్ష వారిని చుట్టుముట్టింది.

16:35Страница 271

وَقَالَ ٱلَّذِينَ أَشۡرَكُواْ لَوۡ شَآءَ ٱللَّهُ مَا عَبَدۡنَا مِن دُونِهِۦ مِن شَيۡءٖ نَّحۡنُ وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِن دُونِهِۦ مِن شَيۡءٖۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ فَهَلۡ عَلَى ٱلرُّسُلِ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ ٣٥

Многобожники говорят: «Если бы Аллах захотел, то ни мы, ни наши отцы не стали бы поклоняться ничему, кроме Него, и мы не стали бы запрещать чтолибо вопреки Ему». Так же поступали те, которые жили прежде. Разве на посланников было возложено что-либо, кроме ясной передачи откровения?

తమ ఆరాధన విషయంలో అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పించేవారు ఇలా పలికారు : ఒక వేళ అల్లాహ్ మేము ఆయన ఒక్కడినే ఆరాధించాలని,మేము ఆయన తోపాటు సాటి కల్పించకూడదని తలచుకుంటే మేము ఆయనను వదిలి ఇతరులను ఆరాధించేవారము కాదు. మేమూ కాదు,మా కన్న మునుపటి మా తాత ముత్తాతలూ కాదు. ఒక వేళ మేము దేనినీ నిషేధించకూడదని ఆయన తలచుకుంటే మేము నిషేధించేవారము కాదు. మునుపటి అవిశ్వాసపరులు ఇటువంటి అసత్య ఆధారాలతో పలికేవారు. దైవ ప్రవక్తలు ఏ సందేశాలను చేరవేయమని ఆదేశించబడ్డారో ఆసందేశాలను స్పష్టంగా చేరవేయటం మాత్రమే వారిపై బాధ్యత ఉన్నది. నిశ్చయంగా వారు సందేశాలను చేరవేశారు. అల్లాహ్ అవిశ్వాసపరుల కొరకు ఇచ్ఛను,ఎంపిక చేసే అధికారము ఇచ్చి వారి వద్దకు తన ప్రవక్తలను పంపించిన తరువాత తఖ్దీర్ ని నిరాకరించే విషయంలో అవిశ్వాసపరుల కొరకు ఎటువంటి ఆధారము లేదు.

16:36Страница 271

وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَۖ فَمِنۡهُم مَّنۡ هَدَى ٱللَّهُ وَمِنۡهُم مَّنۡ حَقَّتۡ عَلَيۡهِ ٱلضَّلَٰلَةُۚ فَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُكَذِّبِينَ ٣٦

Мы отправили к каждой общине посланника: «Поклоняйтесь Аллаху и избегайте тагута!». Среди них есть такие, которых Аллах наставил на прямой путь, и такие, которым было справедливо предначертано заблуждение. Ступайте же по земле и посмотрите, каким был конец неверующих.

మరియు నిశ్చయంగా మేము పూర్వపు ప్రతి జాతిలో ఒక ప్రవక్తను పంపించాము. అతను తన జాతి వారిని అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని,ఆయన కాక వేరే ఏవైన విగ్రహాల,షైతానుల,ఇతర వాటి ఆరాధన వదిలివేయమని ఆదేశించాడు. వారిలో నుండి అల్లాహ్ ఎవరికి అనుగ్రహించాడో వాడు అతన్ని విశ్వసించి,అతని ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించే వాడు ఉన్నాడు.మరియు వారిలో నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,అతని ప్రవక్తపై అవిధేయత చూపినవాడు ఉన్నాడు. ఆయన అతనికి అనుగ్రహించలేదు. అప్పుడు అతనిపై మార్గభ్రష్టత అనివార్యమైపోయినది. అయితే మీరు తిరస్కారులపై శిక్ష,వినాశనము వచ్చిన తరువాత వారి పరిణామం ఏమయిందో చూడటానికి భూమిలో సంచరించండి.

16:37Страница 271

إِن تَحۡرِصۡ عَلَىٰ هُدَىٰهُمۡ فَإِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَن يُضِلُّۖ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ ٣٧

Как бы ты ни хотел наставить их на прямой путь, Аллах не наставляет на прямой путь тех, кого Он вводит в заблуждение, и не будет у них помощников.

ఓ ప్రవక్తా ఒక వేళ మీరు మీకు వీలైనంత మీ ప్రచారము ద్వారా వీరందరి కొరకు శ్రమించినా,వారి సన్మార్గమును మీరు ఆశించినా,దాని కారకాలను ఎంచుకున్నా నిశ్చయంగా అల్లాహ్ మార్గభ్రష్టతకు గురి చేసిన వాడిని సన్మార్గమును అనుగ్రహించడు. మరియు వారి కొరకు అల్లాహ్ కాకుండా వారి నుండి శిక్షను తొలగించటానికి వారికి సహాయపడే వాడు ఎవడూ ఉండడు.

16:38Страница 271

وَأَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ لَا يَبۡعَثُ ٱللَّهُ مَن يَمُوتُۚ بَلَىٰ وَعۡدًا عَلَيۡهِ حَقّٗا وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ٣٨

Именем Аллаха они принесли величайшие клятвы о том, что Аллах не воскресит мертвецов. О нет! Это произойдет согласно истинному обещанию, но большинство людей не знает этого.

మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరు తమ ప్రమాణాల్లో అతిశయోక్తం చేస్తూ వాటిలో శ్రమిస్తూ అల్లాహ్ మరణించేవారిని మరల లేపడని దృఢమైన ప్రమాణాలు చేశారు .దానిపై వారికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకు కాదు అల్లాహ్ తొందరలోనే మరణించే ప్రతీ వ్యక్తిని మరల లేపుతాడు. దానిపై వాగ్ధానము సత్యమైనది.కానీ చాలామందికి అల్లాహ్ మృతులను మరలా లేపుతాడన్న విషయం తెలియదు. అప్పుడే వారు మరణాంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నారు.

16:39Страница 271

لِيُبَيِّنَ لَهُمُ ٱلَّذِي يَخۡتَلِفُونَ فِيهِ وَلِيَعۡلَمَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَنَّهُمۡ كَانُواْ كَٰذِبِينَ ٣٩

Он разъяснит им то, в чем они расходились во мнениях, и неверующие узнают, что они были лжецами.

అల్లాహ్ వారికి వారు విభేదించే ఏకత్వము,మరణాంతర జీవితము,దైవదౌత్యము యొక్క వాస్తవికతను స్పష్టపరచటానికి,అవిశ్వాసపరులు అల్లాహ్ తోపాటు భాగస్వాములు ఉన్నారన్నతమ వాదనలో,మరణాంతర జీవిత విషయంలో తమ తిరస్కారములో అబధ్ధము పలుకుతున్నారని తెలుసుకోవాలని ప్రళయదినాన వారందరిని మరల లేపుతాడు.

16:40Страница 271

إِنَّمَا قَوۡلُنَا لِشَيۡءٍ إِذَآ أَرَدۡنَٰهُ أَن نَّقُولَ لَهُۥ كُن فَيَكُونُ ٤٠

Когда Мы хотим чего-либо, то стоит Нам сказать: «Будь!». - как это сбывается.

నిశ్చయంగా మేము మృతులను జీవింపచేయటమును,మరణాంతరం వారిని లేపటమును నిర్ణయించుకుంటే దాని నుండి మమ్మల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు. ఏదైన విషయంను మేము నిర్ణయించుకుంటే దానితో నీవు అయిపో (కున్) అని అంటాము.అప్పుడు అది ఖచ్చితంగా అయిపోతుంది.

Текст: Quranic Universal Library (Tarteel) через spa5k/tafsir_api (MIT), в зафиксированной версии. Аяты: Quran Foundation. Источники и лицензии

Содержание

Аят аль-Курси36Аль-Кахфстр. 42джуз 15Бухари 1Муслим 2999

Вид

Тема
Размер текста
Вид

Read in English