Al-MukhtasarAl‑Ma'idah · 5:112–120

Al-Mukhtasar · Tafsir · in Telugu

Al-Ma'idah 5:112–120

5:112Page 126

إِذۡ قَالَ ٱلۡحَوَارِيُّونَ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ هَلۡ يَسۡتَطِيعُ رَبُّكَ أَن يُنَزِّلَ عَلَيۡنَا مَآئِدَةٗ مِّنَ ٱلسَّمَآءِۖ قَالَ ٱتَّقُواْ ٱللَّهَ إِن كُنتُم مُّؤۡمِنِينَ ١١٢

[And remember] when the disciples said, "O Jesus, Son of Mary, can your Lord1 send down to us a table [spread with food] from the heaven?" [Jesus] said, "Fear Allāh, if you should be believers."

ఆహారముతో నిండిన పళ్ళెమును ఆకాశము నుండి దింపమని నీవు నీ ప్రభువును దుఆ చేస్తే నీ ప్రభువు దింపగలడా అని హవారీలు కోరినప్పటి సంధర్భమును గుర్తు చేసుకోండి.అయితే ఈసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ కు భయపడుతూ ఉండమని,వారు అడుగుతున్న కోరికను వదిలేయమని ఆదేసిస్తూ వారికి సమాధానమిచ్చారు.బహుశా అందులో వారి కొరకు పరీక్ష (ఫిత్నా) ఉన్నదేమో.మరియు ఆయన వారితో ఇలా అన్నారు : ఒక వేళ మీరు విశ్వాసపరులే అయితే మీ ఆహారమును కోరే విషయంలో మీ ప్రభువు పై నమ్మకమును కలిగి ఉండండి.

5:113Page 126

قَالُواْ نُرِيدُ أَن نَّأۡكُلَ مِنۡهَا وَتَطۡمَئِنَّ قُلُوبُنَا وَنَعۡلَمَ أَن قَدۡ صَدَقۡتَنَا وَنَكُونَ عَلَيۡهَا مِنَ ٱلشَّٰهِدِينَ ١١٣

They said, "We wish to eat from it and let our hearts be reassured and know that you have been truthful to us and be among its witnesses."

హవారీలు ఈసా అలైహిస్సలాం తో ఇలా అన్నారు-: మేము ఈ పళ్లెము నుండి తినాలని,అల్లాహ్ సంపూర్ణ సామర్ధ్యం గురించి,మీరు ఆయన ప్రవక్త అని మా మనస్సులు సంత్రుప్తి చెందాలని,అల్లాహ్ వద్ద నుండి మీరు తీసుకుని వచ్చినది సత్యమని మనకు నమ్మకమైన జ్ఞానము కలగాలని,ఆ సమయంలో ప్రజల్లోంచి ఎవరు హాజరు కాలేదో వారి కొరకు దాని గురించి మేము సాక్షం పలికే వారవ్వాలని మేము కోరుకుంటున్నాము.

5:114Page 127

قَالَ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ ٱللَّهُمَّ رَبَّنَآ أَنزِلۡ عَلَيۡنَا مَآئِدَةٗ مِّنَ ٱلسَّمَآءِ تَكُونُ لَنَا عِيدٗا لِّأَوَّلِنَا وَءَاخِرِنَا وَءَايَةٗ مِّنكَۖ وَٱرۡزُقۡنَا وَأَنتَ خَيۡرُ ٱلرَّٰزِقِينَ ١١٤

Said Jesus, the son of Mary, "O Allāh, our Lord, send down to us a table [spread with food] from the heaven to be for us a festival for the first of us and the last of us and a sign from You. And provide for us, and You are the best of providers."

ఈసా అలైహిస్సలాం వారి కోరికను స్వీకరించారు. అల్లాహ్ తో ఇలా దుఆ చేశారు,"ఓ మా ప్రభువా మా పై ఆహార పళ్ళెమును దింపు. మేము దాని దిగే రోజును పండుగ జరుపుకుని నీకు కృతజ్ఞత తెలుపుకుంటాము.అది నీ ఏకత్వమునకు,నేను దేనిని తీసుకుని వచ్చానో అది సత్యమనుటకు సూచకము,ఆధారమవుతుంది. నీ ఆరాధన చేయటానికి మాకు దోహదపడే ఆహారాన్ని మనకు ప్రసాదించు. ఓ మా ప్రభువా అందరికన్న శ్రేష్టమైన ఆహారాన్ని ప్రసాదించే వాడివి నీవే".

5:115Page 127

قَالَ ٱللَّهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيۡكُمۡۖ فَمَن يَكۡفُرۡ بَعۡدُ مِنكُمۡ فَإِنِّيٓ أُعَذِّبُهُۥ عَذَابٗا لَّآ أُعَذِّبُهُۥٓ أَحَدٗا مِّنَ ٱلۡعَٰلَمِينَ ١١٥

Allāh said, "Indeed, I will send it down to you, but whoever disbelieves afterwards from among you - then indeed will I punish him with a punishment by which I have not punished anyone among the worlds."

అల్లాహ్ ఈసా అలైహిస్సలాం దుఆను స్వీకరించాడు.మరియు ఇలా అన్నాడు : మీరు మీపై దింపమని కోరిన ఈ ఆహార పళ్ళెమును నిశ్చయంగా నేను దింపుతాను.అయితే దానిని దింపిన తరువాత ఎవరైతే తిరస్కరిస్తారో వారు తమనే నిందించుకోవాలి.నేను తొందరలోనే ఎవరికీ విధించనటువంటి కఠినమైన శిక్షను అతనికి విధిస్తాను.ఎందుకంటే అతను తిరుగులేని మహిమను చూశాడు.అతని అవిశ్వాసం బలమైనది.అల్లాహ్ తన వాగ్దానమును వారి కొరకు నిజం చేసి చూపించాడు.దానిని (ఆహారపళ్ళెంను) వారిపై దింపినాడు.

5:116Page 127

وَإِذۡ قَالَ ٱللَّهُ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ ءَأَنتَ قُلۡتَ لِلنَّاسِ ٱتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيۡنِ مِن دُونِ ٱللَّهِۖ قَالَ سُبۡحَٰنَكَ مَا يَكُونُ لِيٓ أَنۡ أَقُولَ مَا لَيۡسَ لِي بِحَقٍّۚ إِن كُنتُ قُلۡتُهُۥ فَقَدۡ عَلِمۡتَهُۥۚ تَعۡلَمُ مَا فِي نَفۡسِي وَلَآ أَعۡلَمُ مَا فِي نَفۡسِكَۚ إِنَّكَ أَنتَ عَلَّٰمُ ٱلۡغُيُوبِ ١١٦

And [beware the Day] when Allāh will say, "O Jesus, Son of Mary, did you say to the people, 'Take me and my mother as deities besides Allāh?'" He will say, "Exalted are You! It was not for me to say that to which I have no right. If I had said it, You would have known it. You know what is within myself, and I do not know what is within Yourself. Indeed, it is You who is Knower of the unseen.

ప్రళయ దినమున మర్యం కుమారుడు ఈసా అలైహిస్సలాంను ఉద్దేశించి అల్లాహ్ పలికే సంధర్భమును మీరు గుర్తు చేసుకోండి: ఓ మర్యం కుమారుడగు ఈసా మీరు ప్రజలతో మీరు నన్ను నా తల్లిని అల్లాహ్ ను వదిలి ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని అన్నారా ?. అప్పుడు ఈసా అలైహిస్సలాం తన ప్రభువు పరిశుద్దతను కొనియాడుతూ ఇలా సమాధానమిచ్చారు : వారికి నేను సత్యం తప్ప వేరే వాటిని తెలపటం నాకు తగదు.ఒక వేళ నేను అలా అని ఉంటే దానిని నీవు తెలుసుకుంటావు.ఎందుకంటే నీ ముందు ఏ విషయం దాగదు.నేను నా మనస్సులో దాచిన విషయాలను నీవు తెలుసుకుంటావు.నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు.నిశ్చయంగా నీ ఒక్కడివే ప్రతి అగోచర విషయాన్ని,ప్రతి దాగి ఉన్న విషయాన్ని,ప్రతి బహిర్గతమైన విషయాన్ని తెలుసుకుంటావు.

5:117Page 127

مَا قُلۡتُ لَهُمۡ إِلَّا مَآ أَمَرۡتَنِي بِهِۦٓ أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ رَبِّي وَرَبَّكُمۡۚ وَكُنتُ عَلَيۡهِمۡ شَهِيدٗا مَّا دُمۡتُ فِيهِمۡۖ فَلَمَّا تَوَفَّيۡتَنِي كُنتَ أَنتَ ٱلرَّقِيبَ عَلَيۡهِمۡۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ ١١٧

I said not to them except what You commanded me - to worship Allāh, my Lord and your Lord. And I was a witness over them as long as I was among them; but when You took me up, You were the Observer over them, and You are, over all things, Witness.

ఈసా అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా అంటారు : నీ ఒక్కడి ఆరాధన చేయమని ప్రజలకు నీవు ఇచ్చిన ఆదేశము మాట తప్ప వేరేది నేను వారికి చెప్పలేదు.నేను వారి మధ్య ఉన్నంత కాలం వారు చెప్పిన మాటలపై సాక్షిగా ఉన్నాను.అయితే ఎప్పుడైతే నీవు నన్ను జీవించి ఉండగానే ఆకాశముపై ఎత్కుకుని వారి మధ్య నా నివాసమును సమాప్తము చేశావో అప్పటి నుండి ఓ నా ప్రభువా నీవే వారి కార్యాలను కనిపెట్టుకుని ఉన్నావు.అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడివి నీవే.నీ ముందట ఏదీ అదృశ్యం అవ్వదు,వారికి నేను చెప్పిన మాటలు,వారు నా తరువాత చెప్పిన మాటలు నీ పై గోప్యంగా ఉండవు.

5:118Page 127

إِن تُعَذِّبۡهُمۡ فَإِنَّهُمۡ عِبَادُكَۖ وَإِن تَغۡفِرۡ لَهُمۡ فَإِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ١١٨

If You should punish them - indeed they are Your servants; but if You forgive them - indeed it is You who is the Exalted in Might, the Wise."

ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారికి శిక్షించదలచుకుంటే నిశ్చయంగా వారు నీ దాసులే.వారి విషయంలో నీవు తలచుకున్నది చేయి.వారిలోంచి విశ్వాసపరులపై క్షమాపణ ద్వారా దయ చూపదలచుకుంటే నీ కొరకు ఆ విషయంలో ఎటువంటి అఢ్డంకి లేదు. ఓడింపబడని సర్వాధిక్యుడివి,నీ పర్యాలోచనలో వివేకవంతుడివి నీవే.

5:119Page 127

قَالَ ٱللَّهُ هَٰذَا يَوۡمُ يَنفَعُ ٱلصَّٰدِقِينَ صِدۡقُهُمۡۚ لَهُمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ١١٩

Allāh will say, "This is the Day when the truthful will benefit from their truthfulness." For them are gardens [in Paradise] beneath which rivers flow, wherein they will abide forever, Allāh being pleased with them, and they with Him. That is the great attainment.

అల్లాహ్ ఈసా అలైహిస్సలాం తో ఇలా అంటాడు-: "ఈ రోజు సంకల్పాల్లో,ఆచరణల్లో,మాటల్లో సత్యవంతులైన వారికి వారి నిజాయితీ ప్రయోజనకరమవుతుంది".వారి కొరకు భవనాల క్రింద నుంచి,వృక్షాల క్రింద నుంచి సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలు కలవు.వాటిలో వారు ఎల్లప్పుడు ఉంటారు.మరణం వారికి సంభవించదు.అల్లాహ్ వారితో ప్రసన్నుడయ్యాడు.వారిపై ఎన్నడు ఆగ్రహం చెందడు.వారు తాము ఏవైతే అతని వద్ద శాస్వత అనుగ్రహాలు పొందారో వాటి కారణంగా అతనితో సంతుష్ఠ పడ్డారు.ఈ ప్రతిఫలము, వారి నుండి (అల్లాహ్) ప్రసన్నతే గొప్ప సాఫల్యము.ఎటువంటి సాఫల్యము దానికి సరితూగదు.

5:120Page 127

لِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا فِيهِنَّۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرُۢ ١٢٠

To Allāh belongs the dominion of the heavens and the earth and whatever is within them. And He is over all things competent.

భూమ్యాకాశాలపై అధికారము అల్లాహ్ ఒక్కడి కొరకే.ఆ రెండింటిని సృష్టించిన వాడు,వాటి పర్యాలోచన చేసేవాడు ఆయనే.వాటిలో ఉన్న సృష్టిరాసులన్నింటి పై అధికారం ఆయన కొరకే.మరియు ఆయన ప్రతి వస్తువు పై అధికారము కలవాడు.ఏ వస్తువు ఆయనను అశక్తుడు చేయదు(విఫలం చేయలేవు).

Text: Quranic Universal Library (Tarteel), via spa5k/tafsir_api (MIT), at a fixed version. The ayahs: Quran Foundation. Sources and licences

Contents

Ayat al-Kursi36Al-Kahfpage 42juz 15Bukhari 1Muslim 2999

Style

Theme
Text size
Layout

Читать на русском