Al-MukhtasarAl‑An'am · 6:136–162

Al-Mukhtasar · Tafsir · in Telugu

Al-An'am 6:136–162

6:136Page 145

وَجَعَلُواْ لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ ٱلۡحَرۡثِ وَٱلۡأَنۡعَٰمِ نَصِيبٗا فَقَالُواْ هَٰذَا لِلَّهِ بِزَعۡمِهِمۡ وَهَٰذَا لِشُرَكَآئِنَاۖ فَمَا كَانَ لِشُرَكَآئِهِمۡ فَلَا يَصِلُ إِلَى ٱللَّهِۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَآئِهِمۡۗ سَآءَ مَا يَحۡكُمُونَ ١٣٦

And they [i.e., the polytheists] assign to Allāh from that which He created of crops and livestock a share and say, "This is for Allāh," by their claim, "and this is for our 'partners' [associated with Him]." But what is for their "partners" does not reach Allāh, while what is for Allāh - this reaches their "partners." Evil is that which they rule.

అల్లాహ్ సృష్టించిన పంట పొలాల్లోంచి,పశువుల్లోంచి కొంత భాగమును అల్లాహ్ కోసం నిర్ధారించుకుని ముష్రికులు తమ తరుపు నుంచి ఆవిష్కరించుకునేవారు. అది అల్లాహ్ కొరకు అని విడ్ఢూరంగా చెప్పేవారు. మరియు మరి కొంత భాగమును తమ విగ్రహాల కొరకు,తమ స్మారక చిహ్నాల కొరకు తమ తరుపు నుండి ఆవిష్కరించుకునేవారు. అయితే వారు తాము సాటి కల్పించుకున్న వారి కొరకు ప్రత్యేకించుకున్నది అల్లాహ్ ఖర్చు చేయమన్న పేదలకు,అగత్యపరులకు చేరేది కాదు. మరియు వారు అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకున్నది తాము సాటి కల్పించుకున్న విగ్రహాలకు చేరుతుంది. వాటి ప్రయోజనాల్లో ఖర్చు చేయబడుతుంది. వినండి వారి తీర్పు,వారి విభజన ఎంతో చెడ్డదైనది.

6:137Page 145

وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٖ مِّنَ ٱلۡمُشۡرِكِينَ قَتۡلَ أَوۡلَٰدِهِمۡ شُرَكَآؤُهُمۡ لِيُرۡدُوهُمۡ وَلِيَلۡبِسُواْ عَلَيۡهِمۡ دِينَهُمۡۖ وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا فَعَلُوهُۖ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُونَ ١٣٧

And likewise, to many of the polytheists their partners1 have made [to seem] pleasing the killing of their children in order to bring about their destruction and to cover them with confusion in their religion. And if Allāh had willed, they would not have done so. So leave them and that which they invent.

మరియు ఏ విధంగా ముష్రికులకు షైతాను ఈ దుర్మార్గపు తీర్పును మంచిగా చేసి చూపించాడో అలాగే చాలామంది ముష్రికులకు వారు సాటి కల్పిస్తున్న షైతానులు అల్లాహ్ అన్యాయంగా హత్య చేయటంను నిషేదించిన ప్రాణమును హత్య చేయటంలో పడవేసి వారిని హతమార్చటం కొరకు,వారికి ఏది ధర్మమో,ఏది అధర్మమో తెలియకుండా వారి ధర్మమును సంశయాస్పదమైనదిగా చేయటానికి వారి సంతానమును పేదరికం భయంతో హతమార్చటంను మంచిదిగా చేసి చూపించారు. ఒక వేళ అల్లాహ్ వారు ఇలా చేయకూడదు అని తలచుకుంటే వారు అలా చేసేవారు కాదు. కాని ఆయన విపరీత వివేకము కొరకు దాన్నే కోరుకున్నాడు. ఓ ప్రవక్తా వారిని,అల్లాహ్ పై వారు అబధ్ధం ను అంటగట్టడంను వదిలి వేయండి. ఎందుకంటే అది మీకు ఎటువంటి నష్టం చేయదు. వారి విషయాన్ని అల్లాహ్ కు అప్పజెప్పండి.

6:138Page 146

وَقَالُواْ هَٰذِهِۦٓ أَنۡعَٰمٞ وَحَرۡثٌ حِجۡرٞ لَّا يَطۡعَمُهَآ إِلَّا مَن نَّشَآءُ بِزَعۡمِهِمۡ وَأَنۡعَٰمٌ حُرِّمَتۡ ظُهُورُهَا وَأَنۡعَٰمٞ لَّا يَذۡكُرُونَ ٱسۡمَ ٱللَّهِ عَلَيۡهَا ٱفۡتِرَآءً عَلَيۡهِۚ سَيَجۡزِيهِم بِمَا كَانُواْ يَفۡتَرُونَ ١٣٨

And they say, "These animals1 and crops are forbidden; no one may eat from them except whom we will," by their claim. And there are those [camels] whose backs are forbidden [by them]2 and those upon which the name of Allāh is not mentioned3 - [all of this] an invention of untruth about Him.4 He will punish them for what they were inventing.

ముష్రికులు ఇలా అన్నారు : ఈ కొన్ని పశువులు,పంటపొలాలు నిషేదించబడినవి. కాని వాటి నుంచి వారు తమ తరపు నుంచి తయారు చేసుకుని విగ్రహాల సేవకులు,ఇతరులను ఎవరిని వారు కోరుకుంటే వారు తినవచ్చు. ఈ పశువులపై స్వారీ చేయటం,వాటిపై బరువులు మోయటం నిషిద్ధం. అవి బహీరహ్,సాయిబహ్,హామీ లు. ఈ పశువులను వారు జుబాహ్ చేసే సమయంలో అల్లాహ్ నామం పటించేవారు కాదు. వాటిని కేవలం తమ విగ్రహాల నామం తీసుకుని జుబాహ్ చేసేవారు. ఇదంతా అల్లాహ్ తరుపు నుండి ఆదేశం అని ఆయనపై అబద్దమును అంటగట్టేవారు. వారు అబద్దమును కల్పించుకున్నందు వల్ల అల్లాహ్ వారికి తొందరలోనే తన శిక్షకు గురి చేస్తాడు.

6:139Page 146

وَقَالُواْ مَا فِي بُطُونِ هَٰذِهِ ٱلۡأَنۡعَٰمِ خَالِصَةٞ لِّذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰٓ أَزۡوَٰجِنَاۖ وَإِن يَكُن مَّيۡتَةٗ فَهُمۡ فِيهِ شُرَكَآءُۚ سَيَجۡزِيهِمۡ وَصۡفَهُمۡۚ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٞ ١٣٩

And they say, "What is in the bellies of these animals1 is exclusively for our males and forbidden to our females. But if it is [born] dead, then all of them have shares therein." He will punish them for their description.2 Indeed, He is Wise and Knowing.

మరియు వారు అన్నారు ఈ సవాయిబ్,బహాయిర్ గర్భాల్లో ఉన్న పిండాలు ఒక వేళ అది పుట్టినప్పుడు జీవించి ఉంటే అది మన మగవారి కొరకు హలాల్ (ధర్మ సమ్మతమైనవి),మన స్త్రీల కొరకు హరామ్ (నిషిద్ధం). ఒక వేళ వాటి గర్భాలలో ఉన్నది మరణించి పుడితే మగవారికి స్తీలకి అందులో భాగముంటుంది. అల్లాహ్ తొందరలోనే వారు వారి మాటలకు ఎటువంటి శిక్షకు అర్హులో దానిని ప్రసాధిస్తాడు. నిశ్చయంగా ఆయన తన శాసనంలో,తన సృష్టి నిర్వహణలో వివేకవంతుడు,వారి గురించి తెలిసినవాడు.

6:140Page 146

قَدۡ خَسِرَ ٱلَّذِينَ قَتَلُوٓاْ أَوۡلَٰدَهُمۡ سَفَهَۢا بِغَيۡرِ عِلۡمٖ وَحَرَّمُواْ مَا رَزَقَهُمُ ٱللَّهُ ٱفۡتِرَآءً عَلَى ٱللَّهِۚ قَدۡ ضَلُّواْ وَمَا كَانُواْ مُهۡتَدِينَ ١٤٠

They will have lost who killed their children in foolishness without knowledge and prohibited what Allāh had provided for them, inventing untruth about Allāh. They have gone astray and were not [rightly] guided.

తమ బుద్ది లేమి వలన,అజ్ఞానం వలన తమ సంతానమును హత్య చేసినవారు,అల్లాహ్ ప్రసాధించిన పశువులను అల్లాహ్ వైపు అబద్దమును అంటగడుతూ నిషేదించుకున్న వారు నాశనమయ్యారు. వారు సన్మార్గం నుండి దూరం అయిపోయారు,వారు సన్మార్గమును పొందలేరు.

6:141Page 146

۞ وَهُوَ ٱلَّذِيٓ أَنشَأَ جَنَّٰتٖ مَّعۡرُوشَٰتٖ وَغَيۡرَ مَعۡرُوشَٰتٖ وَٱلنَّخۡلَ وَٱلزَّرۡعَ مُخۡتَلِفًا أُكُلُهُۥ وَٱلزَّيۡتُونَ وَٱلرُّمَّانَ مُتَشَٰبِهٗا وَغَيۡرَ مُتَشَٰبِهٖۚ كُلُواْ مِن ثَمَرِهِۦٓ إِذَآ أَثۡمَرَ وَءَاتُواْ حَقَّهُۥ يَوۡمَ حَصَادِهِۦۖ وَلَا تُسۡرِفُوٓاْۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡرِفِينَ ١٤١

And He it is who causes gardens to grow, [both] trellised and untrellised, and palm trees and crops of different [kinds of] food and olives and pomegranates, similar and dissimilar. Eat of [each of] its fruit when it yields and give its due [zakāh] on the day of its harvest. And be not excessive.1 Indeed, He does not like those who commit excess.

మరియు అల్లాహ్ సుబహానహు వతఆలా కాండము లేకుండా భూ ఉపరితలంపై వ్యాపించే విధంగా,కాండమును కలిగి భూమి పైకి ఉండే విధంగా తోటలను సృష్టించాడు. మరియు ఆయనే ఖర్జూరపు చెట్లను సృష్టించినాడు. మరియు రూపములో,రుచిలో తేడాకల రకరకాల ఫలాల తోటలను సృష్టించాడు. మరియు ఆయన జైతూను (ఆలివ్),దానిమ్మ చెట్లను వాటి ఆకులు పరస్పరం పోలి ఉండినట్లు,వాటి రూపములో,రుచిలో వేరువేరుగా ఉండేటట్లు సృష్టించాడు. ఓ ప్రజలారా అవి ఫలాలు ఇచ్చినప్పుడు వాటి ఫలాలను తినండి ,వాటిని కోసే రోజు వాటి జకాతును చెల్లించండి. తినే విషయంలో,ఖర్చు చేసే విషయంలో ధర్మ హద్దులను దాటకండి. మరియు అల్లాహ్ ఆ రెండిటి విషయంలో,ఇతర వాటి విషయంలో తన హద్దులను దాటేవారిని ఇష్టపడడు. కాని వారిని ద్వేషిస్తాడు. నిశ్చయంగా ఎవరైతే వాటన్నింటిని సృష్టించాడో ఆయనే వాటిని తన దాసుల కొరకు ధర్మసమ్మతం చేశాడు.అయితే ముష్రికులు వాటిని నిషేదించుకోవటం సరికాదు.

6:142Page 146

وَمِنَ ٱلۡأَنۡعَٰمِ حَمُولَةٗ وَفَرۡشٗاۚ كُلُواْ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ وَلَا تَتَّبِعُواْ خُطُوَٰتِ ٱلشَّيۡطَٰنِۚ إِنَّهُۥ لَكُمۡ عَدُوّٞ مُّبِينٞ ١٤٢

And of the grazing livestock are carriers [of burdens] and those [too] small. Eat of what Allāh has provided for you and do not follow the footsteps of Satan.1 Indeed, he is to you a clear enemy.

మరియు ఆయనే మీ కొరకు పశువుల్లోంచి ఏవైతే బరువు మోయటం,స్వారీ చేయటం కొరకు అనుకూలమైనవో ఉదాహరణకు ఒంటెలు లాంటి వాటిని,బరువు మోయటం స్వారీ చేయటం కొరకు అనుకూలం కానివి చిన్న ఒంటెలు,మేకల్లాంటి వాటిని సృష్టించాడు. ఓ ప్రజలారా మీకు అల్లాహ్ ప్రసాధించినటువంటి వాటిలోంచి ఏవైతే మీ కొరకు ధర్మ సమ్మతం చేశాడో వాటిని తినండి. మరియు అల్లాహ్ నిషేధించిన వాటిని (హరాం చేసిన) ధర్మసమ్మతం(హలాల్) చేసుకోవటంలో,అల్లాహ్ ధర్మ సమ్మతం చేసిన వాటిని నిషేదించుకోవటంలో ఏ విధంగానైతే ముష్రికులు చేశారో అలా చేసి షైతాను అడుగుజాడలో నడవకండి. ఓ ప్రజలార నిశ్చయంగా షైతాను బహిరంగ శతృవు ఏ విధంగానంటే అతడు దీని ద్వారా మీరు అల్లాహ్ కు అవిధేయత పడాలని ఆశిస్తున్నాడు.

6:143Page 147

ثَمَٰنِيَةَ أَزۡوَٰجٖۖ مِّنَ ٱلضَّأۡنِ ٱثۡنَيۡنِ وَمِنَ ٱلۡمَعۡزِ ٱثۡنَيۡنِۗ قُلۡ ءَآلذَّكَرَيۡنِ حَرَّمَ أَمِ ٱلۡأُنثَيَيۡنِ أَمَّا ٱشۡتَمَلَتۡ عَلَيۡهِ أَرۡحَامُ ٱلۡأُنثَيَيۡنِۖ نَبِّـُٔونِي بِعِلۡمٍ إِن كُنتُمۡ صَٰدِقِينَ ١٤٣

[They are] eight mates - of the sheep, two and of the goats, two. Say, "Is it the two males He has forbidden or the two females or that which the wombs of the two females contain? Inform me with knowledge, if you should be truthful."

మీ కొరకు ఆయన ఎనిమిది రకాల జంతువులను సృష్టించాడు. గొర్రెల్లోంచి రెండు ఆడ,మగ మరియు మేకల్లోంచి రెండు ఆడ,మగ. ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలపండి : ఏమిటి అల్లాహ్ ఆ రెండిటిలోంచి మగవి కావటం వలన రెండు మగ జంతువులను నిషేదించాడా ? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో మీరు అనండి : అలాగైతే మీరు ఆడ జంతువులను ఎందుకు నిషేదించుకున్నారు?. లేదా ఆయన ఆడ జంతువులు కావటం వలన రెండు ఆడ జంతువులను నిషేదించాడా? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో అనండి : ఎందుకు మీరు రెండు మగ జంతువులను నిషేదించుకుంటున్నారు? లేదా అతడు గర్భంలో ఉన్న పిండంకావటం వలన రెండు ఆడ జంతువుల గర్భంలో ఉన్న పిండాలను నిషేదించాడా? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో అనండి : ఎందుకు మీరు తల్లి గర్భంలో ఉన్న పిండముల మధ్య వాటి మగ జంతువులను ఒక సారి నిషేదించుకుని,వాటి ఆడ జంతువులను ఒక సారి నిషేదించుకుని తేడా చూపుతున్నారు. ఓ ముష్రికులారా నాకు సమాధానమివ్వండి మీరు దేనిని ఆధారంగా తీసుకున్నారో అది సత్య జ్ఞానములోంచిదా ఈ నిషేదము అల్లాహ్ తరపు నుంచి అన్న దానిలో మీరు చేస్తున్న వాదన విషయంలో మీరు సత్యవంతులే నైతే (నాకు సమాధానమివ్వండి).

6:144Page 147

وَمِنَ ٱلۡإِبِلِ ٱثۡنَيۡنِ وَمِنَ ٱلۡبَقَرِ ٱثۡنَيۡنِۗ قُلۡ ءَآلذَّكَرَيۡنِ حَرَّمَ أَمِ ٱلۡأُنثَيَيۡنِ أَمَّا ٱشۡتَمَلَتۡ عَلَيۡهِ أَرۡحَامُ ٱلۡأُنثَيَيۡنِۖ أَمۡ كُنتُمۡ شُهَدَآءَ إِذۡ وَصَّىٰكُمُ ٱللَّهُ بِهَٰذَاۚ فَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبٗا لِّيُضِلَّ ٱلنَّاسَ بِغَيۡرِ عِلۡمٍۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ١٤٤

And of the camels, two and of the cattle, two. Say, "Is it the two males He has forbidden or the two females or that which the wombs of the two females contain? Or were you witnesses when Allāh charged you with this? Then who is more unjust than one who invents a lie about Allāh to mislead the people by [something] other than knowledge? Indeed, Allāh does not guide the wrongdoing people."

ఎనిమిది రకాల్లో మిగతావి అవి ఒంటెలలోంచి రెండు,ఆవుల్లోంచి రెండు.ఓ ప్రవక్తా మీరు ముష్రికులతో ఇలా తెలపండి : వాటిలోంచి మగ జంతువు కావటం వలన లేదా ఆడ జంతువు కావటం వలన లేదా తల్లి గర్భంలో ఉన్న పిండం కావటం వలన నిషేంచుకోబడినవి అల్లాహ్ నిషేదించాడా?లేదా ఓ ముష్రికులారా మీ ఆలోచనాపరంగా ఈ పశువుల నుండి మీరు ఏవైతే నిషేదించుకున్నారో ఆ నిషేదం గురించి అల్లాహ్ మీకు ఆదేశించినప్పుడు మీరు అక్కడ ఉన్నారా?. ఎటువంటి ఆధారము,జ్ఞానము లేకుండా ప్రజలను సన్మార్గము నుండి మరల్చటం కొరకు అల్లాహ్ పై అబద్దమును అంటగట్టి ఆయన నిషేధించని వాటిని ఆయన నిషేధించినట్లు ఆయన వైపునకు మరల్చే వాడి కంటే పెద్ద దుర్మార్గుడు,పాపాత్ముడు ఇంకొకడుండడు. నిశ్చయంగా అల్లాహ్ పై అబద్దమును అంటగట్టటం వలన దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గము పొందే సౌభాగ్యమును కలిగించడు.

6:145Page 147

قُل لَّآ أَجِدُ فِي مَآ أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٖ يَطۡعَمُهُۥٓ إِلَّآ أَن يَكُونَ مَيۡتَةً أَوۡ دَمٗا مَّسۡفُوحًا أَوۡ لَحۡمَ خِنزِيرٖ فَإِنَّهُۥ رِجۡسٌ أَوۡ فِسۡقًا أُهِلَّ لِغَيۡرِ ٱللَّهِ بِهِۦۚ فَمَنِ ٱضۡطُرَّ غَيۡرَ بَاغٖ وَلَا عَادٖ فَإِنَّ رَبَّكَ غَفُورٞ رَّحِيمٞ ١٤٥

Say, "I do not find within that which was revealed to me [anything] forbidden to one who would eat it unless it be a dead animal or blood spilled out or the flesh of swine - for indeed, it is impure - or it be [that slaughtered in] disobedience, dedicated to other than Allāh.1 But whoever is forced [by necessity], neither desiring [it] nor transgressing [its limit], then indeed, your Lord is Forgiving and Merciful."

ఓ ప్రవక్తా మీరు తెలియజేయండి : అల్లాహ్ నా వైపునకు వహీ ద్వారా తెలిపిన వాటిలో (నిషేధించబడినవిగా) జుబాహ్ చేయకుండా చనిపోయిన జంతువును లేదా ప్రవహించే రక్తం ను లేదా పంది మాంసమును ఎందుకంటే అది అశుద్ధమైనది నిషేదించడినది లేదా అల్లాహ్ నామం కాకుండా ఇతరుల నామం తీసుకుని జుబాహ్ చేయబడినవి. ఉదాహరణకి వారి విగ్రహాల పేరుతో జుబాహ్ చేయబడినది నిషేదించబడినవిగా నేను పొందాను. ఎవరికైనను ఈ నిషేదాలను ఆకలి తీవ్రత వలన తినటం అత్యవసరం అయితే వాటిని తినటంలో రుచిని ఆస్వాధించే ఉద్దేశం లేకుండా, అవసరాన్ని మించకుండా తినటంలో అతనిపై ఎటువంటి పాపం లేదు. ఓ ప్రవక్తా గత్యంతరం లేని వాడు ఒక వేళ అందులోంచి తింటే నిశ్చయంగా మీ ప్రభువు అతనిని క్షమించే వాడును.అతనిపై కరుణించేవాడును.

6:146Page 147

وَعَلَى ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا كُلَّ ذِي ظُفُرٖۖ وَمِنَ ٱلۡبَقَرِ وَٱلۡغَنَمِ حَرَّمۡنَا عَلَيۡهِمۡ شُحُومَهُمَآ إِلَّا مَا حَمَلَتۡ ظُهُورُهُمَآ أَوِ ٱلۡحَوَايَآ أَوۡ مَا ٱخۡتَلَطَ بِعَظۡمٖۚ ذَٰلِكَ جَزَيۡنَٰهُم بِبَغۡيِهِمۡۖ وَإِنَّا لَصَٰدِقُونَ ١٤٦

And to those who are Jews We prohibited every animal of uncloven hoof; and of the cattle and the sheep We prohibited to them their fat, except what adheres to their backs or the entrails or what is joined with bone. [By] that We repaid them for their transgression. And indeed, We are truthful.

మరియు మేము వ్రేళ్ళు విడిగా లేని ఒంటెలు,నిప్పుకోళ్ళు లాంటి వాటిని యూదులపై నిషేదించాము. మరియు ఆవులు,మేకల వీపులకు తగిలిన,వాటి పేగులకు తగిలిన,ప్రక్కటెముకులకు తగిలిన క్రొవ్వు తప్ప ఇతర క్రొవ్వును మేము నిషేదించాము. వారు తమపై వాటిని నిషేదించుకుని దుర్మార్గముకు పాల్పడినందుకు మేము వారికి ప్రతిఫలాన్ని ప్రసాధించాము. నిశ్చయంగా మేము చెప్పే మాటలన్నింటిలో సత్యవంతులము.

6:147Page 148

فَإِن كَذَّبُوكَ فَقُل رَّبُّكُمۡ ذُو رَحۡمَةٖ وَٰسِعَةٖ وَلَا يُرَدُّ بَأۡسُهُۥ عَنِ ٱلۡقَوۡمِ ٱلۡمُجۡرِمِينَ ١٤٧

So if they deny you, [O Muḥammad], say, "Your Lord is the possessor of vast mercy; but His punishment cannot be repelled from the people who are criminals."

ఓ ప్రవక్తా వారు ఒక వేళ మిమ్మల్ని తిరస్కరిస్తే, మీ ప్రభువు వద్ద నుంచి మీరు తీసుకుని వచ్చిన దానిని అంగీకరించకపోతే వారిని ప్రోత్సహించటానికి ఇలా చెప్పండి : మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యము కలవాడు. మీకు గడువివ్వటం,మీపై శిక్షను కురిపించటంలో తొందర చేయకపోవటం మీపై ఆయన కారుణ్యమే. మీరు (ఓ ప్రవక్తా) వారిని హెచ్చరిస్తూ ఇలా అనండి : నిశ్చయంగా పాపాలకు పాల్పడే,అవిధేయతకు పాల్పడే జాతి వారి పైనుండి తొలగించబడదు.

6:148Page 148

سَيَقُولُ ٱلَّذِينَ أَشۡرَكُواْ لَوۡ شَآءَ ٱللَّهُ مَآ أَشۡرَكۡنَا وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِن شَيۡءٖۚ كَذَٰلِكَ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ حَتَّىٰ ذَاقُواْ بَأۡسَنَاۗ قُلۡ هَلۡ عِندَكُم مِّنۡ عِلۡمٖ فَتُخۡرِجُوهُ لَنَآۖ إِن تَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ أَنتُمۡ إِلَّا تَخۡرُصُونَ ١٤٨

Those who associated [others] with Allāh will say, "If Allāh had willed, we would not have associated [anything] and neither would our fathers, nor would we have prohibited anything." Likewise did those before deny until they tasted Our punishment. Say, "Do you have any knowledge that you can produce for us? You follow not except assumption, and you are not but misjudging."

ముష్రికులు అల్లాహ్ తోపాటు వారి సాటి కల్పించటం సరైనదనటంపై అల్లాహ్ చిత్తము,ఆయన తఖ్దీరు ద్వారా వాదిస్తూ తొందరలోనే ఇలా అంటారు : ఒక వేళ అల్లాహ్ మేము సాటి కల్పించ కూడదని,మరియు మా తాత ముత్తాతలు సాటి కల్పించ కూడదని అనుకుంటే మేము ఆయన తోపాటు సాటి కల్పించేవారము కాదు. ఒక వేళ అల్లాహ్ మేము మాపై నిషేదించుకున్న వాటిని నిషేదించుకో కూడదని అనుకుంటే మేము వాటిని నిషేదించుకునే వారము కాదు. వారి నిరాకరించిన వాదన వలె వారికన్న మునుపు వారు తమ ప్రవక్తలను ఇలా తెలుపుతూ తిరస్కరించారు : ఒక వేళ మేము వారిని తిరస్కరించ కూడదని అల్లాహ్ అనుకుంటే మేము వారిని తిరస్కరించే వాళ్ళము కాదు. మేము వారిపై కురిపించిన శిక్షను రుచి చూసే వరకు వారు ఈ తిరస్కరణను కొనసాగించారు. ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : మీరు అల్లాహ్ తోపాటు సాటి కల్పించటాన్ని,ఆయన హరామ్ చేసిన వాటిని మీరు హలాల్ చేసుకోవటాన్ని,ఆయన హలాల్ చేసిన వాటిని మీరు హరామ్ చేసుకోవటాన్ని ఆయన మీతో ప్రసన్నుడైనట్లు నిరూపించే ఏదైన ఆధారం మీ వద్ద ఉన్నదా ?. అది (హలాల్,హరామ్ ) మీ ద్వారా జరగటం ఆయన మీ నుండి ప్రసన్నుడైనట్లు ఆధారం కాదు. మీరు ఈ విషయంలో కేవలం ఊహలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా ఊహ సత్యం విషయంలో దేనికి పనికి రాదు.మరియు మీరు కేవలం తిరస్కరిస్తున్నారు.

6:149Page 148

قُلۡ فَلِلَّهِ ٱلۡحُجَّةُ ٱلۡبَٰلِغَةُۖ فَلَوۡ شَآءَ لَهَدَىٰكُمۡ أَجۡمَعِينَ ١٤٩

Say, "With Allāh is the far-reaching [i.e., conclusive] argument. If He had willed, He would have guided you all."

ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలియ పరచండి : మీకు ఈ బలహీన వాదనలు తప్ప వేరే వాదనలు లేవు. నిశ్చయంగా అల్లాహ్ కొరకు పరిపూర్ణ వాదన కలదు. మీరు ప్రవేశపెట్టే వంకలు దాని ముందట సమాప్తమైపోతాయి. మరియు దాని ద్వారా మీరు జత చేయబడిన మీ పోలిక నిర్వీర్యమైపోతుంది. ఒక వేళ మీకందరికి సత్యమును అనుసరించే సౌభాగ్యమును ప్రసాధించాలని అల్లాహ్ అనుకుంటే దానిని మీకు తప్పకుండా ప్రసాధించేవాడు.

6:150Page 148

قُلۡ هَلُمَّ شُهَدَآءَكُمُ ٱلَّذِينَ يَشۡهَدُونَ أَنَّ ٱللَّهَ حَرَّمَ هَٰذَاۖ فَإِن شَهِدُواْ فَلَا تَشۡهَدۡ مَعَهُمۡۚ وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ وَهُم بِرَبِّهِمۡ يَعۡدِلُونَ ١٥٠

Say, [O Muḥammad], "Bring forward your witnesses who will testify that Allāh has prohibited this." And if they testify, do not testify with them. And do not follow the desires of those who deny Our verses and those who do not believe in the Hereafter, while they equate [others] with their Lord.

ఓ ప్రవక్తా అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరామ్ చేసుకుని దానిని అల్లాహ్ యే హరామ్ చేశాడని వాదించే ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : మీరు నిషేదించుకున్న ఈ వస్తువులన్నింటిని అల్లాహ్ నిషేదించాడు అని సాక్షం పలకటానికి మీ సాక్షులను మీరు ప్రవేశపెట్టండి. ఒక వేళ వారు అల్లాహ్ నిషేదించాడు అనటానికి ఎటువంటి జ్ఞానం లేకుండా నిరాధారంగా సాక్షమిస్తే ఓ ప్రవక్తా మీరు వారిని వారి సాక్ష్యం విషయంలో అంగీకరించకండి. ఎందుకంటే అది అబద్ద సాక్ష్యం. తమ కోరికలను శాసించే వారి కోరికలను నీవు అనుసరించకు. ఎప్పుడైతే వారు అల్లాహ్ హలాల్ చేసిన వాటిని తమ కొరకు హరామ్ చేసుకున్నారో వారు మా ఆయతులను తిరస్కరించారు. పరలోకమును విశ్వసించని వారిని మీరు అనుసరించకండి. వారందరు తమ ప్రభువుతోపాటు వేరేవారిని సమానులుగా చేసి సాటి కల్పిస్తున్నారు. తన ప్రభువుతో ఎవరి నడవడి ఈ విధంగా ఉన్నదో అతడు ఎలా అనుసరించబడుతాడు ?.

6:151Page 148

۞ قُلۡ تَعَالَوۡاْ أَتۡلُ مَا حَرَّمَ رَبُّكُمۡ عَلَيۡكُمۡۖ أَلَّا تُشۡرِكُواْ بِهِۦ شَيۡـٔٗاۖ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَٰنٗاۖ وَلَا تَقۡتُلُوٓاْ أَوۡلَٰدَكُم مِّنۡ إِمۡلَٰقٖ نَّحۡنُ نَرۡزُقُكُمۡ وَإِيَّاهُمۡۖ وَلَا تَقۡرَبُواْ ٱلۡفَوَٰحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَۖ وَلَا تَقۡتُلُواْ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّۚ ذَٰلِكُمۡ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمۡ تَعۡقِلُونَ ١٥١

Say, "Come, I will recite what your Lord has prohibited to you. [He commands] that you not associate anything with Him, and to parents, good treatment, and do not kill your children out of poverty; We will provide for you and them. And do not approach immoralities - what is apparent of them and what is concealed. And do not kill the soul which Allāh has forbidden [to be killed] except by [legal] right. This has He instructed you that you may use reason."

ఓ ప్రవక్తా మీరు ప్రజలతో ఇలా అనండి : మీరు రండి అల్లాహ్ నిషేదించిన వాటిని మీకు నేను చదివి వినిపిస్తాను. అల్లాహ్ సృష్టితాల్లోంచి దేనిని కూడా మీరు ఆయనతో పాటు సాటి కల్పించటాన్ని,మీ తల్లిదండ్రులపట్ల మీరు అవిధేయతకు పాల్పడటంను,కాని వారితో మంచిగా మెలగటం మీపై తప్పనిసరి.పేదరికం కారణం చేత మీ సంతానమును మీరు హత్య చేయటంను మీ పై నిషేదించాడు. ఏ విధంగానైతే అజ్ఞానులు చేసేవారో ఆవిధంగా. మేమే మీకు ఆహారాన్ని ప్రసాధిస్తాము,వారికి ఆహారాన్ని ప్రసాధిస్తాము. సిగ్గుమాలిన పనులు అవి బాహటంగా జరిగేవైనా,గుట్టుగా జరిగేవైనా వాటికి మీరు దగ్గరవటాన్ని,అల్లాహ్ దేని హత్య చేయటంను నిషేధించాడో దానిని మీరు ఆ ప్రాణమును హత్య చేయటంను మీపై నిషేధించాడు. కాని సత్యబద్ధంగా వివాహం తరువాత వ్యభిచారం చేయటం,ఇస్లాం స్వీకరించిన తరువాత ఇస్లాం నుండి మరలి పోవటం లాంటివి. మీరు అల్లాహ్ ఆదేశించిన వాటిని,ఆయన వారించిన వాటిని అర్ధం చేసుకుంటారని ఆయన ఈ ప్రస్తావించిన వాటి ద్వారా మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు.

6:152Page 149

وَلَا تَقۡرَبُواْ مَالَ ٱلۡيَتِيمِ إِلَّا بِٱلَّتِي هِيَ أَحۡسَنُ حَتَّىٰ يَبۡلُغَ أَشُدَّهُۥۚ وَأَوۡفُواْ ٱلۡكَيۡلَ وَٱلۡمِيزَانَ بِٱلۡقِسۡطِۖ لَا نُكَلِّفُ نَفۡسًا إِلَّا وُسۡعَهَاۖ وَإِذَا قُلۡتُمۡ فَٱعۡدِلُواْ وَلَوۡ كَانَ ذَا قُرۡبَىٰۖ وَبِعَهۡدِ ٱللَّهِ أَوۡفُواْۚ ذَٰلِكُمۡ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ ١٥٢

And do not approach the orphan's property except in a way that is best [i.e., intending improvement] until he reaches maturity. And give full measure and weight in justice. We do not charge any soul except [with that within] its capacity. And when you speak [i.e., testify], be just, even if [it concerns] a near relative. And the covenant of Allāh fulfill. This has He instructed you that you may remember.

మరియు అనాధ ఎవరైతే యుక్త వయస్సుకు చేరక ముందు తన తండ్రిని కోల్పోయాడో అతని సొమ్ముకు మీరు దగ్గరవ్వటంను ఆయన (అల్లాహ్) నిషేదించాడు. కాని అతని కొరకు మేలు మరియు లాభం,అతని సంపదను అధికం చేయటం ద్వారా అతను యుక్తవయస్సుకు చేరుకుని దానిని మానవీకరణ చేసుకునేంత వరకు (అతని సంపదకు దగ్గరవ్వవచ్చు). మరియు కొలతలు వేయటంలో,తూకం వేయటంలో హెచ్చుతగ్గులు చేయటమును ఆయన మీపై నిషేదించాడు. అంతేకాక క్రయవిక్రయ సమయంలో ఇచ్చిపుచ్చుకునే విషయంలో న్యాయపూరిత వ్యవహారము మీపై తప్పనిసరి. మేము ఏ ప్రాణిపై శక్తికి మించిన భారము వేయము. కొలతలు వేయటంలో,ఇతర విషయాల్లో హెచ్చుతగ్గుల నుండి జాగ్రత్త పడటం సాధ్యం కానప్పుడు దాని గురించి లెక్క తీసుకోబడదు. దగ్గర బంధువులు,స్నేహితులు కాకుండా (ఇతరుల విషయంలో) ఏదైన సమాచారం లేదా సాక్ష్యం విషయంలో తప్పు చెప్పటం మీపై నిషేదించబడింది. (అంటే ప్రతి ఒక్కరి విషయంలో న్యాయపూరితంగా వ్యవహరించండి). అల్లాహ్ యొక్క ఒప్పందం అదీ మీరు అల్లాహ్ తో చేసినదైన లేదా అల్లాహ్ మీతో చేసినదైన దానిని భంగపరచటము మీపై ఆయన నిషేధించాడు. అంతేకాదు దానిని పూర్తి చేయటం మీపై తప్పనిసరి.మీ వ్యవహారాల పర్యవసానం మీరు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఈ ముందు తెలుపబడినవి వీటి ద్వారా అల్లాహ్ మిమ్మల్ని తాకీదుగా ఆదేశించాడు.

6:153Page 149

وَأَنَّ هَٰذَا صِرَٰطِي مُسۡتَقِيمٗا فَٱتَّبِعُوهُۖ وَلَا تَتَّبِعُواْ ٱلسُّبُلَ فَتَفَرَّقَ بِكُمۡ عَن سَبِيلِهِۦۚ ذَٰلِكُمۡ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمۡ تَتَّقُونَ ١٥٣

And, [moreover], this is My path, which is straight, so follow it; and do not follow [other] ways, for you will be separated from His way. This has He instructed you that you may become righteous.

అప మార్గములను, దాని దారులను మీరు అనుసరించటం ఆయన మీపై నిషేదించాడు. కాని ఎటువంటి వంకరతనం లేని సన్మార్గమైన అల్లాహ్ మార్గమును అనుసరించటం మీపై తప్పనిసరి. అప మార్గము మిమ్మల్ని విభజన వైపునకు,సత్య మార్గము నుండి దూరం చేయుటకు దారి తీస్తుంది. మీరు ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారని ఆశిస్తూ సన్మార్గమైన అల్లాహ్ మార్గమును ఈ అనుసరణ గురించే అల్లాహ్ మీకు ఆదేశిస్తున్నాడు.

6:154Page 149

ثُمَّ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ تَمَامًا عَلَى ٱلَّذِيٓ أَحۡسَنَ وَتَفۡصِيلٗا لِّكُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ لَّعَلَّهُم بِلِقَآءِ رَبِّهِمۡ يُؤۡمِنُونَ ١٥٤

Then1 We gave Moses the Scripture, making complete [Our favor] upon the one who did good [i.e., Moses] and as a detailed explanation of all things and as guidance and mercy that perhaps in the meeting with their Lord they would believe.

ప్రస్తావించబడిన వాటి ద్వారా సమాచారమిచ్చిన తరువాత మేము మూసాకు అనుగ్రహమును పరిపూర్ణం చేయటం కొరకు,ఆయన సత్కర్మకు ప్రతిఫలంగా,ధర్మ విషయంలో ఆయనకు అవసరమైన ప్రతి వస్తువుకు సూచనగా,సత్యమును,కారుణ్యమును,మార్గమును పొందటానికి ప్రళయదినాన తమ ప్రభువును కలవటం పై విశ్వాసమును కలిగి దాని కొరకు పుణ్య కార్యము ద్వారా సిద్ధం అవుతారని ఆశిస్తు తౌరాతును ప్రసాధించామని సమాచారమిస్తున్నాము.

6:155Page 149

وَهَٰذَا كِتَٰبٌ أَنزَلۡنَٰهُ مُبَارَكٞ فَٱتَّبِعُوهُ وَٱتَّقُواْ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ ١٥٥

And this [Qur’ān] is a Book We have revealed [which is] blessed, so follow it and fear Allāh that you may receive mercy.

మరియు ఈ ఖుర్ఆన్ గ్రంధము దేనినైతే మేము అవతరింపజేశామో అందులో ప్రాపంచిక,ధార్మిక ప్రయోజనాలు కలిగి ఉండటం వలన ఎంతో శుభప్రదమైనది. కాబట్టి మీరు అందులో అవతరింప జేసిన వాటిని అనుసరించండి. మీరు కరుణించబడాలని ఆశిస్తూ దాని వ్యతిరేకత నుండి మీరు జాగ్రత్తపడండి.

6:156Page 149

أَن تَقُولُوٓاْ إِنَّمَآ أُنزِلَ ٱلۡكِتَٰبُ عَلَىٰ طَآئِفَتَيۡنِ مِن قَبۡلِنَا وَإِن كُنَّا عَن دِرَاسَتِهِمۡ لَغَٰفِلِينَ ١٥٦

[We revealed it] lest you say, "The Scripture was only sent down to two groups before us, but we were of their study unaware,"

(మేము మీపై ఖుర్ఆన్ ను మీ భాషలో అవతరింపజేశాము) ఓ అరబు ముష్రికులారా మీరు ఇలా అనకుండా ఉండటానికి : కేవలం అల్లాహ్ తౌరాతును,ఇంజీలును మాకన్న ముందు యూదులు,క్రైస్తవులపై అవతరింపజేశాడు. మన పై ఏ గ్రంధం అవతరింపజేయలేదు. మరియు మనకు వారి గ్రంధాలు చదవటం రాదు. ఎందుకంటే అవి వారి భాషలో ఉన్నవి,అవి మా భాషలో లేవు.

6:157Page 149

أَوۡ تَقُولُواْ لَوۡ أَنَّآ أُنزِلَ عَلَيۡنَا ٱلۡكِتَٰبُ لَكُنَّآ أَهۡدَىٰ مِنۡهُمۡۚ فَقَدۡ جَآءَكُم بَيِّنَةٞ مِّن رَّبِّكُمۡ وَهُدٗى وَرَحۡمَةٞۚ فَمَنۡ أَظۡلَمُ مِمَّن كَذَّبَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَصَدَفَ عَنۡهَاۗ سَنَجۡزِي ٱلَّذِينَ يَصۡدِفُونَ عَنۡ ءَايَٰتِنَا سُوٓءَ ٱلۡعَذَابِ بِمَا كَانُواْ يَصۡدِفُونَ ١٥٧

Or lest you say, "If only the Scripture had been revealed to us, we would have been better guided than they." So there has [now] come to you a clear evidence from your Lord and a guidance and mercy. Then who is more unjust than one who denies the verses of Allāh and turns away from them? We will recompense those who turn away from Our verses with the worst of punishment for their having turned away.

మరియు మీరు ఇలా అనకుండా ఉండటానికి : ఒక వేళ అల్లాహ్ క్రైస్తవులు,యూదులపై గ్రంధాన్ని అవతరింప జేసినట్లు మన పై అవతరింపజేసి ఉంటే మేము వారి కన్నా ఎక్కువగా స్థిరత్వాన్ని కలిగి ఉండే వాళ్ళము. వాస్తవానికి అల్లాహ్ మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మీ భాషలో అవతరింపజేసిన గ్రంధం వచ్చినది. అది స్పష్టమైన వాదన,సత్యం వైపు మార్గ దర్శకము,ఉమ్మత్ కొరకు కారుణ్యము. అయితే మీరు బలహీన సాకులు చూపకండి,తప్పుడు కారణాలు తెలపకండి. అల్లాహ్ ఆయతులను తిరస్కరించే వాడు,వాటి నుండి మరలి పోయే వాడి కన్న పెద్ద దుర్మార్గుడు ఇంకొకడుండడు. మా ఆయతుల నుండి మరలి పోయే వారిని వారి మరలిపోవటంకు,వారి విముఖతకు ప్రతిఫలంగా నరకంలో ప్రవేశింపజేసి తొందరలోనే మేము కఠినంగా శిక్షిస్తాము.

6:158Page 150

هَلۡ يَنظُرُونَ إِلَّآ أَن تَأۡتِيَهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ يَأۡتِيَ رَبُّكَ أَوۡ يَأۡتِيَ بَعۡضُ ءَايَٰتِ رَبِّكَۗ يَوۡمَ يَأۡتِي بَعۡضُ ءَايَٰتِ رَبِّكَ لَا يَنفَعُ نَفۡسًا إِيمَٰنُهَا لَمۡ تَكُنۡ ءَامَنَتۡ مِن قَبۡلُ أَوۡ كَسَبَتۡ فِيٓ إِيمَٰنِهَا خَيۡرٗاۗ قُلِ ٱنتَظِرُوٓاْ إِنَّا مُنتَظِرُونَ ١٥٨

Do they [then] wait for anything except that the angels should come to them or your Lord should come or that there come some of the signs1 of your Lord? The Day that some of the signs of your Lord will come no soul will benefit from its faith as long as it had not believed before or had earned through its faith some good. Say, "Wait. Indeed, we [also] are waiting."

ఓ ప్రవక్త సత్య తిరస్కారులు ఇహలోకంలో వారి ఆత్మలను తీసుకోవటం కొరకు మరణ దూత మరియు అతని సహాయకులు వారి వద్దకు రావాలని లేదా పరలోకంలో తీర్పు దినమున వారి మధ్య తీర్పునివ్వటం కొరకు వారి ప్రభువు రావాలని లేదా ప్రళయం గురించి సూచించే నీ ప్రభువు యొక్క కొన్ని సూచనలు రావాలని నిరీక్షిస్తున్నారు. సూర్యుడు పడమర నుండి ఉదయించటం లాంటి నీ ప్రభువు సూచనల్లోంచి కొన్ని వచ్చిన రోజు అవిశ్వాసపరునికి అతని విశ్వాసం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. ఎటువంటి సత్కార్యం చేయని విశ్వాసపరుని విశ్వాసం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా తెలియపరచండి : ఈ విషయాల్లోంచి దేని గురించైన మీరు నిరీక్షించండి,నిశ్చయముగా మేము నిరీక్షిస్తున్నాము.

6:159Page 150

إِنَّ ٱلَّذِينَ فَرَّقُواْ دِينَهُمۡ وَكَانُواْ شِيَعٗا لَّسۡتَ مِنۡهُمۡ فِي شَيۡءٍۚ إِنَّمَآ أَمۡرُهُمۡ إِلَى ٱللَّهِ ثُمَّ يُنَبِّئُهُم بِمَا كَانُواْ يَفۡعَلُونَ ١٥٩

Indeed, those who have divided their religion and become sects - you, [O Muḥammad], are not [associated] with them in anything. Their affair is only [left] to Allāh; then He will inform them about what they used to do.

నిశ్చయంగా యూదులు,క్రైస్తవులు ధర్మములోంచి కొన్ని వాటిని తీసుకుని కొన్ని వాటిని వదిలి వేసి తమ ధర్మమును వేరు వేరు చేసుకున్నారు. వారు వేరు వేరు వర్గాలుగా అయిపోయారు. ఓ ప్రవక్త ఏ విషయంలో కూడా మీకు వారితో సంబంధం లేదు. వారు ఉన్న అపమార్గము నుండి మీరు నిర్దోషులు. కేవలం వారిని హెచ్చరించే బాధ్యత మీపై కలదు. వారి వ్యవహారం దైవాదీనమై ఉంది. ఆయన ప్రళయదినాన ఇహలోకంలో వారు చేసిన కర్మలగురించి వారికి తెలియపరుస్తాడు. ఆయన వాటి పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

6:160Page 150

مَن جَآءَ بِٱلۡحَسَنَةِ فَلَهُۥ عَشۡرُ أَمۡثَالِهَاۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجۡزَىٰٓ إِلَّا مِثۡلَهَا وَهُمۡ لَا يُظۡلَمُونَ ١٦٠

Whoever comes [on the Day of Judgement] with a good deed will have ten times the like thereof [to his credit], and whoever comes with an evil deed will not be recompensed except the like thereof; and they will not be wronged.1

విశ్వాసపరుల్లోంచి ఎవరైన ఒక సత్కార్యమును చేసి ఉంటే అల్లాహ్ ప్రళయదినాన దానిని అతని కొరకు పది సత్కార్యాలుగా పెంచుతాడు. ఎవరన్న పాప కార్యమునకు పాల్పడితే అది చిన్నదైన, పెద్దదైన దాని ప్రకారం అతనిని శిక్షించటం జరుగుతుంది. సత్కార్యాల పుణ్యమును తగ్గించి పాప కార్యాల శిక్షను పెంచి ప్రళయదినాన వారికి అన్యాయం చేయటం జరగదు.

6:161Page 150

قُلۡ إِنَّنِي هَدَىٰنِي رَبِّيٓ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ دِينٗا قِيَمٗا مِّلَّةَ إِبۡرَٰهِيمَ حَنِيفٗاۚ وَمَا كَانَ مِنَ ٱلۡمُشۡرِكِينَ ١٦١

Say, "Indeed, my Lord has guided me to a straight path - a correct religion - the way of Abraham, inclining toward truth. And he was not among those who associated others with Allāh."

ఓ ప్రవక్తా తిరస్కార వైఖరి కల ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : నా ప్రభువు ఒక సన్మార్గమును నాకు చూపించాడు. అది ఇహ,పరలోక ప్రయోజనాల ద్వారా స్థిరమైన ధర్మము యొక్క మార్గము. సత్యం వైపునకు మరలిన ఇబ్రాహీం యొక్క ధర్మము అది. ఆయన ఎప్పుడు కూడా ముష్రికుల్లోంచి కాలేదు.

6:162Page 150

قُلۡ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحۡيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ١٦٢

Say, "Indeed, my prayer, my rites of sacrifice, my living and my dying are for Allāh, Lord of the worlds.

ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : నిశ్చయంగా నా నమాజు,నా జుబాహ్ చేయటం అల్లాహ్ కొరకే,అల్లాహ్ పేరుతోనే. ఆయన కాకుండా వేరే వారి పేరుతో కాదు. నా జీవనం,నా మరణం ప్రతి ఒక్కటి సృష్టిరాసులందరి ఏకైక ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయన కాకుండా వేరేవారికి అందులో భాగం లేదు.

Text: Quranic Universal Library (Tarteel), via spa5k/tafsir_api (MIT), at a fixed version. The ayahs: Quran Foundation. Sources and licences

Contents

Ayat al-Kursi36Al-Kahfpage 42juz 15Bukhari 1Muslim 2999

Style

Theme
Text size
Layout

Читать на русском