Аль-Мухтасар · Тафсир · на телугу
Аль-Исра 17:78–111
17:78Страница 290
أَقِمِ ٱلصَّلَوٰةَ لِدُلُوكِ ٱلشَّمۡسِ إِلَىٰ غَسَقِ ٱلَّيۡلِ وَقُرۡءَانَ ٱلۡفَجۡرِۖ إِنَّ قُرۡءَانَ ٱلۡفَجۡرِ كَانَ مَشۡهُودٗا ٧٨
Совершай намаз с полудня до наступления ночного мрака и читай Коран на рассвете. Воистину, на рассвете Коран читают при свидетелях (ангелах).
మీరు నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో దాని వేళల్లో సూర్యుడు ఆకాశము మధ్య నుండి వాలినప్పటి నుండి - ఇందులో జొహర్,అసర్ నమాజులు ఉన్నాయి - రాత్రి చీకటి వరకు - ఇందులో మగ్రిబ్,ఇషా నమాజులు ఉన్నవి - నెలకోల్పండి. మరియు మీరు ఫజర్ నమాజును నెలకోల్పండి,అందులో ఖిరాఅత్ (ఖుర్ఆన్ పారాయణము) ను సుదీర్ఘంగా చేయండి. ఫజర్ నమాజు వేళ రాత్రి దైవ దూతలు,పగటి దైవ దూతలు హాజరవుతారు.
17:79Страница 290
وَمِنَ ٱلَّيۡلِ فَتَهَجَّدۡ بِهِۦ نَافِلَةٗ لَّكَ عَسَىٰٓ أَن يَبۡعَثَكَ رَبُّكَ مَقَامٗا مَّحۡمُودٗا ٧٩
Бодрствуй часть ночи, читая Коран во время дополнительных намазов. Быть может, Господь твой возведет тебя на Достохвальное место.
ఓ ప్రవక్తా నీవు రాత్రి నిలబడి అందులో కొద్ది భాగము నమాజు చదువు. నీ నమాజు నీ కొరకు నీ స్థానములను పెంచటంలో అధికమవటానికి, ప్రళయదినాన నీ ప్రభువు నిన్ను ప్రజల కొరకు వారు ఉన్న భయాందోళనల నుండి సిఫారసు చేసే వాడిగా పంపిస్తాడని అన్వేషిస్తూ, నీ కొరకు సిఫారసు యొక్క గొప్ప స్థానము దేనినైతే ముందువారు ,చివరి వారు పొగిడారో అది కలగటానికి.
17:80Страница 290
وَقُل رَّبِّ أَدۡخِلۡنِي مُدۡخَلَ صِدۡقٖ وَأَخۡرِجۡنِي مُخۡرَجَ صِدۡقٖ وَٱجۡعَل لِّي مِن لَّدُنكَ سُلۡطَٰنٗا نَّصِيرٗا ٨٠
Скажи: «Господи! Пусть мое пришествие будет правдивым, и пусть мой уход будет правдивым! Даруй мне от Тебя знамение в помощь».
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా ప్రభువా నా ప్రవేశాలన్నింటిని,నా బహిర్గమనాలన్నింటిని నీ విధేయతలో,నీ ఇష్టానుసారంగా ఉండేటట్లు చేయి. మరియు నీ వద్ద నుండి నాకు నీవు నా శతృవు కి విరద్ధంగా సహాయపడటానికి బహిరంగ ఆధారమును తయారు చేసి ఇవ్వు.
17:81Страница 290
وَقُلۡ جَآءَ ٱلۡحَقُّ وَزَهَقَ ٱلۡبَٰطِلُۚ إِنَّ ٱلۡبَٰطِلَ كَانَ زَهُوقٗا ٨١
Скажи: «Явилась истина, и сгинула ложь. Воистину, ложь обречена на погибель».
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఇస్లాం వచ్చింది.అల్లాహ్ దానికి సహాయము చేసి దాని ద్వారా ఏదైతే వాగ్ధానం చేశాడో అవి నిరూపితమైనవి. మరియు షిర్క్,అవిశ్వాసం అంతరించింది. నిశ్చయంగా అసత్యము సత్యం ముందట నిలబడలేక అంతరించిపోతుంది.
17:82Страница 290
وَنُنَزِّلُ مِنَ ٱلۡقُرۡءَانِ مَا هُوَ شِفَآءٞ وَرَحۡمَةٞ لِّلۡمُؤۡمِنِينَ وَلَا يَزِيدُ ٱلظَّٰلِمِينَ إِلَّا خَسَارٗا ٨٢
Мы ниспосылаем в Коране то, что является исцелением и милостью для верующих, а беззаконникам он не прибавляет ничего, кроме убытка.
మేము అవతరింపజేస్తున్నటువంటి ఈ ఖుర్ఆన్ అజ్ఞానము,అవిశ్వాసము,సందేహము నుండి హృదయముల కొరకు స్వస్థత కలది, దాన్ని చదివి ఊదినప్పుడు శరీరముల కొరకు స్వస్థత కలది, దాని ప్రకారం ఆచరించే విశ్వాసపరుల కొరకు కారుణ్యము కలది. ఈ ఖుర్ఆన్ అవిశ్వాసపరుల కొరకు వినాశనమును మాత్రమే అధికం చేస్తుంది. ఎందుకంటే దాన్ని వింటే అది వారికి ఆగ్రహమును కలిగిస్తుంది, దాని నుండి తిరస్కారమును,విముఖతను వారికి అధికం చేస్తుంది.
17:83Страница 290
وَإِذَآ أَنۡعَمۡنَا عَلَى ٱلۡإِنسَٰنِ أَعۡرَضَ وَنَـَٔا بِجَانِبِهِۦ وَإِذَا مَسَّهُ ٱلشَّرُّ كَانَ يَـُٔوسٗا ٨٣
Когда Мы даруем милость человеку, он отворачивается и удаляется в гордыне. Если же его касается беда, то он приходит в отчаяние.
మరియు మేము మానవునికి ఆరోగ్యము,ఐశ్వర్యము లాంటి అనుగ్రహాలను అనుగ్రహించినప్పుడు అతడు అల్లాహ్ కి కృతజ్ఞత తెలపటం నుండి,ఆయనకు విధేయత చూపటం నుండి విముఖత చూపుతాడు,అహంకారముతో దూరమవుతాడు. మరియు అతనికి అనారోగ్యము లేదా పేదరికం,అటువంటివి ఏవైన కలిగినప్పుడు అతడు అల్లాహ్ కారుణ్యము నుండి తీవ్రంగా నిరాశ,నిస్పృహలకు లోనవుతాడు.
17:84Страница 290
قُلۡ كُلّٞ يَعۡمَلُ عَلَىٰ شَاكِلَتِهِۦ فَرَبُّكُمۡ أَعۡلَمُ بِمَنۡ هُوَ أَهۡدَىٰ سَبِيلٗا ٨٤
Скажи: «Каждый человек избирает свой путь, а вашему Господу лучше знать, кто следует более прямым путем».
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ప్రతీ మనిషి సన్మార్గ విషయంలో,అపమార్గ విషయంలో తన పరిస్థితికి తగిన విధమైన తన పద్దతి ప్రకారం ఆచరిస్తున్నాడు. అయితే సత్యం వైపునకు మార్గం ప్రకారం సన్మార్గం పొందిన వాడెవడో మీ ప్రభువుకు బాగా తెలుసు.
17:85Страница 290
وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلرُّوحِۖ قُلِ ٱلرُّوحُ مِنۡ أَمۡرِ رَبِّي وَمَآ أُوتِيتُم مِّنَ ٱلۡعِلۡمِ إِلَّا قَلِيلٗا ٨٥
Они станут спрашивать тебя о духе (душе или Джибриле). Скажи: «Дух - от повеления моего Господа, а вам дано знать об этом очень мало».
ఓ ప్రవక్తా గ్రంధవహులలో నుండి అవిశ్వాసపరులు మీతో ఆత్మ యొక్క వాస్తవికత గురించి అడుగుతున్నారు. అయితే మీరు వారితో ఇలా పలకండి : ఆత్మ యొక్క వాస్తవికత గురించి అల్లాహ్ కి మాత్రమే తెలుసు. మరియు మీకు,సృష్టితాలన్నిటికి ఇవ్వబడిన జ్ఞానము పరిశుద్ధుడైన అల్లాహ్ జ్ఞానము ముందు చాలా తక్కువ.
17:86Страница 290
وَلَئِن شِئۡنَا لَنَذۡهَبَنَّ بِٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِۦ عَلَيۡنَا وَكِيلًا ٨٦
Если бы Мы захотели, то лишили бы тебя того, что дали тебе в откровении. И никто не защитил бы тебя от Нас,
అల్లాహ్ సాక్షిగా ఓ ప్రవక్తా ఒక వేళ మేము మీపై అవతరింపజేసిన దైవ వాణిని హృదయముల నుండి,పుస్తకముల నుండి చరిపివేసి తీసుకుని వెళ్ళదలిస్తే తప్పకుండా మేము దాన్ని తీసుకుని వెళతాము. ఆ తరువాత మీకు సహాయపడి ఆయన స్పందనకు బాధ్యత వహించేవాడిని మీరు పొందలేరు.
17:87Страница 291
إِلَّا رَحۡمَةٗ مِّن رَّبِّكَۚ إِنَّ فَضۡلَهُۥ كَانَ عَلَيۡكَ كَبِيرٗا ٨٧
не будь милости твоего Господа. Воистину, Его милость к тебе велика!
కానీ నీ ప్రభువు తరపు నుండి కారుణ్యముగా దాన్ని మేము తీసుకుని వెళ్ళ లేదు. మరియు దాన్ని మేము భద్రంగా ఉంచాము. నిశ్చయంగా నిన్ను ప్రవక్తగా చేసినప్పుడు,ప్రవక్తల పరంపర నీతో సమాప్తం చేసినప్పుడు,నీ పై ఖుర్ఆన్ ను అవతరింపజేసినప్పుడు నీ పై నీ ప్రభువు యొక్క అనుగ్రహము ఎంతో గొప్పది.
17:88Страница 291
قُل لَّئِنِ ٱجۡتَمَعَتِ ٱلۡإِنسُ وَٱلۡجِنُّ عَلَىٰٓ أَن يَأۡتُواْ بِمِثۡلِ هَٰذَا ٱلۡقُرۡءَانِ لَا يَأۡتُونَ بِمِثۡلِهِۦ وَلَوۡ كَانَ بَعۡضُهُمۡ لِبَعۡضٖ ظَهِيرٗا ٨٨
Скажи: «Если бы люди и джинны объединились для того, чтобы сочинить нечто, подобное этому Корану, это не удалось бы им, даже если бы они стали помогать друг другу».
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ మానవులు, జిన్నులు అందరు కలిసి మీపై అవతరింపబడినదైన ఈ ఖుర్ఆన్ దాని వాగ్ధాటిలో,దాని మంచి వ్యవస్థీకరణలో,దాని స్పష్టతలో పోలిటువంటి దానిని తీసుకుని రాదలచుకుంటే ఖచ్చితంగా వారు ఎన్నటికి తీసుకుని రాలేరు. ఒక వేళ వారు ఒకరికొకరు సహాయసహకారాలు చేసుకున్నా కూడా.
17:89Страница 291
وَلَقَدۡ صَرَّفۡنَا لِلنَّاسِ فِي هَٰذَا ٱلۡقُرۡءَانِ مِن كُلِّ مَثَلٖ فَأَبَىٰٓ أَكۡثَرُ ٱلنَّاسِ إِلَّا كُفُورٗا ٨٩
Мы разъяснили людям в этом Коране всякие притчи, но большинство людей отвергает все, кроме неверия.
నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు స్పష్టపరచాము మరియు అందులో దాని ద్వారా గుణపాఠం నేర్చుకోబడే ప్రతీది హితబోధనల్లో నుండి,గుణపాఠాల్లో నుండి,ఆదేశాలలో నుండి,వారింపులలో నుండి,గాధలలో నుండి అన్ని రకాల వాటిని వారు విశ్వసిస్తారని ఆశిస్తూ వివరించాము. అయితే చాలా మంది ప్రజలు ఈ ఖుర్ఆన్ పట్ల వ్యతిరేకతను,నిరాకరణను విడనాడలేదు.
17:90Страница 291
وَقَالُواْ لَن نُّؤۡمِنَ لَكَ حَتَّىٰ تَفۡجُرَ لَنَا مِنَ ٱلۡأَرۡضِ يَنۢبُوعًا ٩٠
Они говорят: «Ни за что мы не уверуем, пока ты не исторгнешь для нас из земли источник;
ముష్రికులు నీవు మా కొరకు మక్కా నేల నుండి ఎన్నటికి ఎండని,ప్రవహించే సెలయేరును తీసేంత వరకు మేము నీపై విశ్వాసమును కనబరచము అని అన్నారు.
17:91Страница 291
أَوۡ تَكُونَ لَكَ جَنَّةٞ مِّن نَّخِيلٖ وَعِنَبٖ فَتُفَجِّرَ ٱلۡأَنۡهَٰرَ خِلَٰلَهَا تَفۡجِيرًا ٩١
или пока не будет у тебя пальмовой рощи и виноградника, в которых ты проложишь реки;
లేదా నీ కొరకు ఖర్జూరపు,ద్రాక్ష వృక్షాలు కలిగి అందులో నుంచి భారీగా ప్రవహించే కాలువలు గల ఒక తోట ఉండాలి.
17:92Страница 291
أَوۡ تُسۡقِطَ ٱلسَّمَآءَ كَمَا زَعَمۡتَ عَلَيۡنَا كِسَفًا أَوۡ تَأۡتِيَ بِٱللَّهِ وَٱلۡمَلَٰٓئِكَةِ قَبِيلًا ٩٢
или пока не обрушишь на нас небо кусками, как ты это утверждаешь; или не предстанешь перед нами вместе с Аллахом и ангелами;
లేదా నీవు ప్రస్తావించినట్లు ఆకాశము నుండి శిక్ష ముక్క మాపై వచ్చిపడాలి లేదా నీవు అల్లాహ్ ను,దైవ దూతలను ప్రత్యక్షంగా తీసుకుని వచ్చి వారు నీ కొరకు నీవు వాదిస్తున్నది సరైనదని సాక్ష్యం చెప్పనంత వరకు.
17:93Страница 291
أَوۡ يَكُونَ لَكَ بَيۡتٞ مِّن زُخۡرُفٍ أَوۡ تَرۡقَىٰ فِي ٱلسَّمَآءِ وَلَن نُّؤۡمِنَ لِرُقِيِّكَ حَتَّىٰ تُنَزِّلَ عَلَيۡنَا كِتَٰبٗا نَّقۡرَؤُهُۥۗ قُلۡ سُبۡحَانَ رَبِّي هَلۡ كُنتُ إِلَّا بَشَرٗا رَّسُولٗا ٩٣
или пока у тебя не будет дома из драгоценностей; или пока ты не взойдешь на небо. Но мы не поверим в твое восхождение, пока ты не спустишься с Писанием, которое мы станем читать». Скажи: «Пречист мой Господь! Я же - всего лишь человек и посланник».
లేదా నీ కొరకు బంగారముతో గాని ఇతర వాటితో గాని అలంకరించబడిన గృహము ఉండాలి లేదా నీవు ఆకాశము వైపు ఎక్కాలి, ఒక వేళ నీవు దాని వైపు ఎక్కినా అల్లాహ్ వద్ద నుండి నీవు అల్లాహ్ ప్రవక్త అని మేము చదవటానికి వ్రాయబడిన ఏదైన గ్రంధమును తీసుకుని నీవు దిగితే కానీ నీవు ప్రవక్తగా పంపించబడినావని మేము విశ్వసించమంటే విశ్వసించము. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : నా ప్రభువు పరిశుద్ధుడు. నేను ప్రవక్తలందరి మాదిరిగా ఒక మానవుడైన ప్రవక్తను మాత్రమే.నాకు నేనే దేనిని తీసుకుని వచ్చే అధికారము లేదు అటువంటప్పుడు మీరు ప్రతిపాదించిన దాన్ని నేను తీసుకుని రావటం ఎలా సాధ్యం అవుతుంది ?.
17:94Страница 291
وَمَا مَنَعَ ٱلنَّاسَ أَن يُؤۡمِنُوٓاْ إِذۡ جَآءَهُمُ ٱلۡهُدَىٰٓ إِلَّآ أَن قَالُوٓاْ أَبَعَثَ ٱللَّهُ بَشَرٗا رَّسُولٗا ٩٤
Людям помешало уверовать после того, как к ним явилось верное руководство, только то, что они сказали: «Неужели Аллах отправил посланником человека?».
అవిశ్వాసపరులను అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచటం నుండి,ప్రవక్త తీసుకుని వచ్చిన దానిపై అమలు చేయటం నుండి ఆపినది కేవలం వారు తిరస్కార వైఖరితో "ఏమీ అల్లాహ్ మా వద్దకు మనషుల్లోండి ఒక ప్రవక్తను పంపించాడా ?" అని పలికిన వేళ ప్రవక్త మానవుల రకంలో నుండి కావటమును వారి తిరస్కారము మాత్రమే .
17:95Страница 291
قُل لَّوۡ كَانَ فِي ٱلۡأَرۡضِ مَلَٰٓئِكَةٞ يَمۡشُونَ مُطۡمَئِنِّينَ لَنَزَّلۡنَا عَلَيۡهِم مِّنَ ٱلسَّمَآءِ مَلَكٗا رَّسُولٗا ٩٥
Скажи: «Если бы по земле спокойно ходили ангелы, то Мы отправили бы к ним посланником с неба ангела».
ఓ ప్రవక్తా వారిని ఖండిస్తూ ఇలా పలకండి : ఒక వేళ భూమిపై దైవ దూతలే అందులో నివసిస్తూ ఉండి మీ పరిస్థితి మాదిరిగా వారు నిశ్చింతగా సంచరిస్తూ ఉంటే మేము ఖచ్చితంగా వారి వద్దకు వారిలో నుండే ఒక దైవ దూతను ప్రవక్తగా పంపిస్తాము. ఎందుకంటే అతను తాను దేనిని తీసుకుని వచ్చాడో (పంపించబడ్డాడో) దాన్ని వారికి అర్ధం అయ్యేటట్లు చెప్పగలడు. అటువంటప్పుడు వారి వద్దకు (దైవ దూతల వద్దకు) మానవుల్లో నుండి ఒకరిని ప్రవక్తగా పంపించటం వివేకము కాదు. అలాగే మీ పరిస్థితి కూడాను.
17:96Страница 291
قُلۡ كَفَىٰ بِٱللَّهِ شَهِيدَۢا بَيۡنِي وَبَيۡنَكُمۡۚ إِنَّهُۥ كَانَ بِعِبَادِهِۦ خَبِيرَۢا بَصِيرٗا ٩٦
Скажи: «Довольно того, что Аллах является Свидетелем между мною и вами. Воистину, Он знает и видит Своих рабов».
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డాను అనటానికి,నేను మీ వద్దకు ఇచ్చి పంపించబడిన సందేశాలను మీకు చేర వేశాను అనటానికి నాకు,మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. నిశ్చయంగా ఆయన తన దాసుల స్థితులను చుట్టుముట్టి ఉన్నాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. వారి మనసుల్లో గోప్యంగా ఉన్న ప్రతీ దానిని వీక్షిస్తున్నాడు.
17:97Страница 292
وَمَن يَهۡدِ ٱللَّهُ فَهُوَ ٱلۡمُهۡتَدِۖ وَمَن يُضۡلِلۡ فَلَن تَجِدَ لَهُمۡ أَوۡلِيَآءَ مِن دُونِهِۦۖ وَنَحۡشُرُهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عَلَىٰ وُجُوهِهِمۡ عُمۡيٗا وَبُكۡمٗا وَصُمّٗاۖ مَّأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ كُلَّمَا خَبَتۡ زِدۡنَٰهُمۡ سَعِيرٗا ٩٧
Тот, кого Аллах ведет прямым путем, следует прямым путем. А для того, кого Аллах вводит в заблуждение, ты не найдешь покровителей вместо Него. В День воскресения Мы соберем их лежащими ничком, слепыми, немыми, глухими. Их пристанищем будет Геенна. Как только она утихает, Мы добавляем им пламени.
వాస్తవానికి అల్లాహ్ ఎవరికి సన్మార్గమును పొందే సౌభాగ్యమును ప్రసాధిస్తాడో వాడే సన్మార్గంపై ఉన్నాడు. దాని నుండి ఆయన ఎవరిని పరాభవమునకు లోను చేసి మార్గ భ్రష్టతకు లోను చేస్తాడో ఓ ప్రవక్తా మీరు వారి కొరకు సత్యం వైపునకు దారి చూపే,వారి నుండి చెడును నిర్మూలించే,వారికి ప్రయోజనమును తీసుకుని వచ్చే రక్షకులను పొందరు. మరియు మేము వారిని ప్రళయ దినాన వారు చూడకుండా,మాట్లాడకుండా,వినకుండా వారి ముఖములపై ఈడ్చబడినట్లు ఉన్న స్థితిలో సమీకరిస్తాము. వారు ఆశ్రమం పొందే వారి నివాసము నరకము. దాని జ్వాలలు చల్లారినప్పుడల్లా మేము వారిపై మండించటమును అధికం చేస్తాము.
17:98Страница 292
ذَٰلِكَ جَزَآؤُهُم بِأَنَّهُمۡ كَفَرُواْ بِـَٔايَٰتِنَا وَقَالُوٓاْ أَءِذَا كُنَّا عِظَٰمٗا وَرُفَٰتًا أَءِنَّا لَمَبۡعُوثُونَ خَلۡقٗا جَدِيدًا ٩٨
Таково возмездие им за то, что они не уверовали в Наши знамения и говорили: «Неужели после того, как мы превратимся в прах и частички, мы будем воскрешены в новом творении?».
ఈ శిక్ష ఏదైతే వారు పొందుతారో అది మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతుల పట్ల వారి తిరస్కారము వలన,మరణాంతర జివితమును దూరంగా భావించి ఇలా వారి పలకటం వలన వారి ప్రతిఫలము : ఏమీ మేము మరణించి కృసించిపోయిన ఎముకలవలె మారిపోయి ముక్కలు ముక్కలై భాగములుగా అయిపోయినప్పుడు దాని తరువాత మేము సరిక్రొత్త సృష్టిగా లేపబడుతామా ?.
17:99Страница 292
۞ أَوَلَمۡ يَرَوۡاْ أَنَّ ٱللَّهَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ قَادِرٌ عَلَىٰٓ أَن يَخۡلُقَ مِثۡلَهُمۡ وَجَعَلَ لَهُمۡ أَجَلٗا لَّا رَيۡبَ فِيهِ فَأَبَى ٱلظَّٰلِمُونَ إِلَّا كُفُورٗا ٩٩
Неужели они не видят, что Аллах, сотворивший небеса и землю, способен создать подобных им? Он установил для них срок, в котором нет сомнения, но беззаконники отвергают все, кроме неверия.
ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరికి భూమ్యాకాశములను గొప్పగా సృష్టించిన వాడు వారి లాంటివారిని సృష్టించటంపై సమర్ధుడని తెలియదా ?. అయితే ఎవరైతే గొప్పవైన వాటిని సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు దాని కన్నఅల్పమైన వాటిని సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు. ఇహలోకంలో అల్లాహ్ వారి కొరకు ఒక నిర్ణీత సమయమును ఎందులోనైతే వారి జీవితం ముగుస్తుందో తయారు చేశాడు. మరియు వారిని మరణాంతరం లేపటం కొరకు ఎటువంటి సందేహం లేని ఒక గడువును తయారు చేశాడు. ముష్రికులు మరణాంతరం లేపబడటం యొక్క ఆధారాలు బహిర్గతమైనా కూడా,దాని ఆధారాలు స్పష్టమైనా కూడా మరణాంతరము లేపబడటమును తిరస్కరించకుండా ఉండరు.
17:100Страница 292
قُل لَّوۡ أَنتُمۡ تَمۡلِكُونَ خَزَآئِنَ رَحۡمَةِ رَبِّيٓ إِذٗا لَّأَمۡسَكۡتُمۡ خَشۡيَةَ ٱلۡإِنفَاقِۚ وَكَانَ ٱلۡإِنسَٰنُ قَتُورٗا ١٠٠
Скажи: «Если бы вы владели сокровищницами милости моего Господа, то все равно скупились бы из страха обеднеть, ибо человек скуп».
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఒక వేళ అంతం కాని,ముగియని నా ప్రభువు యొక్క కారుణ్యము యొక్క నిక్షేపాలు మీ ఆదీనంలో ఉంటే అప్పుడు మీరు పేదవారిగా కాకుండా ఉండేంత వరకు అవి అంతం అయిపోతాయన్న భయంతో ఖర్చు చేయకుండా ఆగిపోతారు. మరియు మనిషి పిసినారి అని సీలు వేయబడ్డాడు. కాని ఒక వేళ అతను విశ్వాసపరుడైతే అతడు అల్లాహ్ పుణ్యమును ఆశిస్తూ ఖర్చు చేస్తాడు.
17:101Страница 292
وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَىٰ تِسۡعَ ءَايَٰتِۭ بَيِّنَٰتٖۖ فَسۡـَٔلۡ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ إِذۡ جَآءَهُمۡ فَقَالَ لَهُۥ فِرۡعَوۡنُ إِنِّي لَأَظُنُّكَ يَٰمُوسَىٰ مَسۡحُورٗا ١٠١
Мы даровали Мусе (Моисею) девять ясных знамений. Спроси сынов Исраила (Израиля) о том, как Муса (Моисей) пришел к ним, и Фараон сказал ему: «О Муса (Моисей)! Воистину, я полагаю, что ты околдован».
మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు ఆయన కొరకు సాక్ష్యం పలికే తొమ్మిది స్పష్టమైన మహిమలను (ఆధారాలను) ప్రసాధించాము.అవి 1-చేతి కర్ర, 2-చేయి (యదే బైజా), 3-కరువుకాటకాలు, 4-ఆహార ధాన్యాల్లో,ఫలాల్లో కొరత, 5-తుఫాను,6-మిడుతల దండు, 7-పేలు, 8-కప్పలు, 9-రక్తము. అయితే ఓ ప్రవక్తా మీరు యూదులను మూసా వారి పూర్వికుల వద్దకు ఈ మహిమలను తీసుకుని వచ్చినప్పటి వైనమును గురించి అడగండి. అప్పుడు ఫిర్ఔన్ ఆయనతో ఇలా అన్నాడు : ఓ మూసా నీవు తీసుకుని వచ్చిన ఈ వింతల వలన నేను నిన్ను చేతబడి (మంత్రజాలము) చేయబడిన ఒక వ్యక్తిగా భావిస్తున్నాను.
17:102Страница 292
قَالَ لَقَدۡ عَلِمۡتَ مَآ أَنزَلَ هَٰٓؤُلَآءِ إِلَّا رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ بَصَآئِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَٰفِرۡعَوۡنُ مَثۡبُورٗا ١٠٢
Муса (Моисей) сказал: «Ты уже знаешь, что не кто иной, а только Господь небес и земли ниспослал их в качестве наглядных знамений. О Фараон! Я полагаю, что тебя постигнет погибель».
మూసా అలైహిస్సలాం అతని మాటలను ఖండిస్తూ ఇలా పలికారు : ఓ పిర్ఔన్ భూమ్యాకాశముల ప్రభువైన అల్లాహ్ మాత్రమే ఈ మహిమలను అవతరింపజేశాడని నీకు ఖచ్చితంగా తెలుసు. ఆయన వాటిని తన సామర్ధ్యమునకు,తన ప్రవక్త నిజాయితీకి ఆధారాలుగా అవతరింపజేశాడు. కాని నీవు తిరస్కరించావు. ఓ ఫిర్ఔన్ నీవు వినాశనమునకు గురై నష్టపోతావని నిశ్చయంగా నాకు బాగా తెలుసు.
17:103Страница 292
فَأَرَادَ أَن يَسۡتَفِزَّهُم مِّنَ ٱلۡأَرۡضِ فَأَغۡرَقۡنَٰهُ وَمَن مَّعَهُۥ جَمِيعٗا ١٠٣
Фараону хотелось вытеснить их с земли, но Мы потопили его и всех, кто был с ним.
అప్పుడు ఫిర్ఔన్, మూసా అలైహిస్సలాం,ఆయన జాతి వారిని మిసర్ నుండి వెళ్ళగొట్టి శిక్షించదలచాడు. అప్పుడు మేము అతన్ని,అతనితోపాటు ఉన్న అతని సైన్యములందరినీ ముంచి తుదిముట్టించాము.
17:104Страница 292
وَقُلۡنَا مِنۢ بَعۡدِهِۦ لِبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱسۡكُنُواْ ٱلۡأَرۡضَ فَإِذَا جَآءَ وَعۡدُ ٱلۡأٓخِرَةِ جِئۡنَا بِكُمۡ لَفِيفٗا ١٠٤
После этого Мы сказали сынам Исраила (Израиля): «Живите на этой земле. А когда исполнится последнее обещание, Мы соберем вас всех вместе».
మరియు ఫిర్ఔన్,అతని సైన్యములను తుదిముట్టించిన తరువాత మేము ఇస్రాయీలు సంతతి వారితో మీరు షామ్ (సిరియా) ప్రాంతములో నివశించండి. ప్రళయ దినం అయినప్పుడు మేము మీరందరిని మహ్షర్ లో లెక్క తీసుకోవటానికి తీసుకుని వస్తాము.
17:105Страница 293
وَبِٱلۡحَقِّ أَنزَلۡنَٰهُ وَبِٱلۡحَقِّ نَزَلَۗ وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا مُبَشِّرٗا وَنَذِيرٗا ١٠٥
Мы ниспослали его (Коран) с истиной, и он сошел с истиной, а тебя Мы послали только добрым вестником и предостерегающим увещевателем.
ఈ ఖుర్ఆన్ ను మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సత్యముతో అవతరింపజేశాము. అది సత్యముతో ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఆయనపై అవతరించింది. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని భీతి కలవారికి స్వర్గపు శుభవార్తనిచ్చేవాడిగా,అవిశ్వాసపరులకు ,పాపాత్ములకు నరకము నుండి భయపెట్టే వానిగా మాత్రమే పంపించాము.
17:106Страница 293
وَقُرۡءَانٗا فَرَقۡنَٰهُ لِتَقۡرَأَهُۥ عَلَى ٱلنَّاسِ عَلَىٰ مُكۡثٖ وَنَزَّلۡنَٰهُ تَنزِيلٗا ١٠٦
Мы разделили Коран для того, чтобы ты читал его людям не спеша. Мы ниспослали его частями.
మరియు మీరు ఖుర్ఆన్ ని ప్రజలపై చదివేటప్పుడు నెమ్మదిగా,ఆగిఆగి చదువుతారని ఆశిస్తూ మేము దాన్ని ఖుర్ఆన్ గా అవతరింపజేసి దాన్ని వివరింపజేశాము,స్పష్టపరచాము. ఎందుకంటే అది అర్ధం చేసుకోవటానికి,యోచన చేయటానికి ఎక్కువగా ప్రేరేపిస్తుంది. మరియు మేము దాన్ని సంఘటనల,స్థితుల లెక్క ప్రకారం వంతులవారిగా,విడివిడిగా అవతరింపజేశాము.
17:107Страница 293
قُلۡ ءَامِنُواْ بِهِۦٓ أَوۡ لَا تُؤۡمِنُوٓاْۚ إِنَّ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ مِن قَبۡلِهِۦٓ إِذَا يُتۡلَىٰ عَلَيۡهِمۡ يَخِرُّونَۤ لِلۡأَذۡقَانِۤ سُجَّدٗاۤ ١٠٧
Скажи: «Веруйте в него (Коран) или не веруйте! Воистину, когда его читают тем, кому прежде было даровано знание, они падают ниц, касаясь земли своими подбородками.
ఓ ప్రవక్తా మీరు వారితో అనండి : మీరు ఆయనపై విశ్వాసమును కనబరచండి. మీ విశ్వాసము ఆయనకు ఏమీ అధికం చేయదు లేదా మీరు ఆయనను విశ్వసించకపోయినా (ఏమీ అధికం చేయదు). మీ అవిశ్వాసం ఆయనది ఏమీ తరిగించదు. నిశ్చయంగా ఎవరైతే పూర్వ దివ్య గ్రంధాలను చదివి,దైవ వాణి,దైవ దౌత్యమును గుర్తించారో వారిపై ఖుర్ఆన్ చదివి వినిపించబడినప్పుడు వారు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సాష్టాంగపడుతూ తమ ముఖములపై బొర్లా పడిపోతారు.
17:108Страница 293
وَيَقُولُونَ سُبۡحَٰنَ رَبِّنَآ إِن كَانَ وَعۡدُ رَبِّنَا لَمَفۡعُولٗا ١٠٨
Они говорят: «Хвала нашему Господу! Воистину, обещание нашего Господа непременно исполнится».
మరియు వారు తమ సజ్దాలలో ఇలా పలుకుతారు : మా ప్రభువు వాగ్ధానమును నెరవేర్చకుండా ఉండటం నుండి అతీతుడు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం (ప్రవక్తగా పంపించటం) గురించి ఏదైతే వాగ్ధానం చేశాడో అది నెరవేరుతుంది. నిశ్చయంగా దాని గురించి,వేరే దాని గురించి మా ప్రభువు వాగ్ధానము ఖచ్చితముగా నెరవేరుతుంది.
17:109Страница 293
وَيَخِرُّونَ لِلۡأَذۡقَانِ يَبۡكُونَ وَيَزِيدُهُمۡ خُشُوعٗا۩ ١٠٩
Они падают ниц, касаясь земли подбородками и рыдая. И это приумножает их смирение».
మరియు వారు అల్లాహ్ కొరకు సాష్టాంగపడుతూ ఆయన భయముతో ఏడుస్తూ తమ ముఖములపై పడిపోతారు. ఖుర్ఆన్ ను వినటం,దాని అర్ధాల్లో యోచన చేయటం అల్లాహ్ కొరకు వినమ్రతను,ఆయన భీతిని వారికి అధికం చేస్తుంది.
17:110Страница 293
قُلِ ٱدۡعُواْ ٱللَّهَ أَوِ ٱدۡعُواْ ٱلرَّحۡمَٰنَۖ أَيّٗا مَّا تَدۡعُواْ فَلَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰۚ وَلَا تَجۡهَرۡ بِصَلَاتِكَ وَلَا تُخَافِتۡ بِهَا وَٱبۡتَغِ بَيۡنَ ذَٰلِكَ سَبِيلٗا ١١٠
Скажи: «Призывайте Аллаха или призывайте Милостивого! Как бы вы ни призывали Его, у Него - самые прекрасные имена». Не совершай свой намаз громко и не совершай его шепотом, а выбери среднее между этим.
ఓ ప్రవక్తా దుఆలో మీ మాటలైన యా అల్లాహ్,యా రహ్మాన్ ను విభేదించిన వారితో ఇలా పలుకు : అల్లాహ్,అర్రహ్మాన్ పరిశుద్ధుడైన ఆయన నామములు. అయితే మీరు వాటిలో నుండి దేని ద్వారా నైన లేదా అవి కాకుండా ఆయన నామములలో నుండి వేరే వాటి ద్వారా ఆయనను పిలవండి. పరిశుద్ధుడైన ఆయన కొరకు మంచి నామములు కలవు. ఈ రెండూ వాటిలో నుంచే. అయితే మీరు ఆ రెండిటి ద్వారా లేదా ఆయన మంచి నామములలో నుండి వేరే వాటి ద్వారా ఆయనను పిలవండి. మరియు నీవు నీ నమాజులో ఖుర్ఆన్ పరాయణమును ముష్రికులు వినేటట్లుగా బిగ్గరగా చేయకు మరియు విశ్వాసపరులు దానిని విననట్లుగా మెల్లగా చేయకు. ఆ రెండింటి మద్య మార్గమును అవలింబించు.
17:111Страница 293
وَقُلِ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي لَمۡ يَتَّخِذۡ وَلَدٗا وَلَمۡ يَكُن لَّهُۥ شَرِيكٞ فِي ٱلۡمُلۡكِ وَلَمۡ يَكُن لَّهُۥ وَلِيّٞ مِّنَ ٱلذُّلِّۖ وَكَبِّرۡهُ تَكۡبِيرَۢا ١١١
Скажи: «Хвала Аллаху, Который не взял Себе сына, Который ни с кем не делит власть, Которому не нужен защитник от унижения». И возвеличивай Его величаво!
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : పొగడ్తలన్నీ అన్నీ రకాల పొగడ్తలకు అర్హుడైన ఆ అల్లాహ్ కొరకే ఎవడైతే సంతానమును కలిగి ఉండటం నుండి అతీతుడు,భాగస్వామి కలిగి ఉండటం నుండి అతీతుడు. ఆయన రాజరికములో ఆయనకి ఎటువంటి భాగస్వామి లేడు.ఆయనకు ఎటువంటి అవమానము గాని,పరాభవము గాని కలగదు. ఆయనకు మద్దతునిచ్చే,బలోపేతం చేసే వారు ఆయనకు అవసరం లేదు. నీవు ఆయన గొప్పతనమును ఎక్కువగా కొనియాడు. అయితే నీవు ఆయన కొరకు ఎటువంటి సంతానమును గాని,రాజరికంలో ఎటువంటి భాగస్వామిని గాని ఎటువంటి సహాయం చేసేవాడు మద్దతునిచ్చే వాడిని గాని అంటగట్టకు.
Текст: Quranic Universal Library (Tarteel) через spa5k/tafsir_api (MIT), в зафиксированной версии. Аяты: Quran Foundation. Источники и лицензии